అజ్క్షాత‌వాసి.. వీడి చ‌ర్య‌లు ఊహాతీతం..

Trivikram bold decision for Agnathavasi
మోస్ట్ అవైటింగ్ టీజ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అనుకోవాలేమో ఇప్పుడు అజ్ఞ‌తవాసిపై ఉన్న అంచ‌నాలు చూస్తుంటే. బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయి అంచ‌నాలు క్యారీ చేస్తున్న సినిమా ఇదే. ఇప్పుడు ఈ చిత్రం టీజ‌ర్ వ‌చ్చేసింది.. ఇన్నాళ్లూ కేవ‌లం ఫ‌స్ట్ లుక్ తోనే ఊరించిన ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు విజువ‌ల్ ట్రీట్ ఇచ్చేసాడు. ఈ టీజ‌ర్ చూసిన త‌ర్వాత అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోతాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా టీజ‌ర్లో కొన్ని షాట్స్ మాత్రం అద్భుతంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ప‌వ‌న్ ఎంట్రీ సీన్.. వెన‌కాల సూర్యుడు ఉండేది ప్ల‌స్ ఓ వ్య‌క్తిపై కాలు పెట్టి రోడ్డు దాటే షాట్ త్రివిక్ర‌మ్ లోని ద‌ర్శ‌కుడికి నిద‌ర్శ‌నం. మాట‌ల‌తో మాయ చేయ‌క‌పోయినా.. అద్భుత‌మైన విజువ‌ల్స్ తో క‌ట్టిప‌డేసారు. క‌ళ్లుచెదిరే ఫైట్స్.. ప‌వ‌న్ అప్పియ‌రెన్స్.. కామెడీ.. యాక్ష‌న్ అన్నీ అదుర్స్ అనిపించాడు త్రివిక్ర‌మ్. ఇక ప‌వ‌న్ గ్లామ‌ర్ గురించి ఏం చెప్పాలి..? 50కి చేరువ‌లో ఉన్నా కూడా ఇప్ప‌టికీ కుర్రాడిలా మెరిసి పోయాడంతే. అ..ఆ టీజ‌ర్ త‌ర‌హాలోనే కృష్ణుడి స్తోత్రంతో ఈ టీజ‌ర్ అంతా న‌డిచింది. చివ‌ర్లో మాత్రం అత‌డి చ‌ర్య‌లు అద్భుతం అంటూ ఊరించాడు ద‌ర్శ‌కుడు. ఇక ప‌వ‌న్ కూడా త‌న‌దైన కామెడీ.. యాక్ష‌న్ టైమింగ్ తో కేక పెట్టించాడు. ఈ టీజ‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా అజ్ఞాత‌వాసిపై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. జ‌న‌వరి 10న సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here