అతను ఎన్ని పెళ్ళిలయినా చేసుకోవచ్చు గాని మేము మాత్రం చేసుకోకూడదా?

 

నీతోనే డ్యాన్స్ అనే టీవీ కార్యక్రమం ద్వారా రేణు దేశాయ్ మళ్ళి కెమెరా ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. రేణు ఈ డ్యాన్స్ షో కి న్యాయ నిర్ణేత గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా రేణు విజయదశమి నాడు ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. మళ్ళి పెళ్లి చేసుకుంటారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రేణు తనని అర్ధం చేసుకుని, పిల్లలను అంగీకరించే మాతురెడ్ పర్సన్ దొరికితే ఆలోచిస్తానని చెప్పింది.
అంతే ఈ మాట తో ఆమె ట్విట్టర్ లో ట్రోలింగ్ మొదలయ్యింది. ఫ్యాన్స్ ఆమెను మళ్ళి పెళ్లి చేసుకోవద్దని, ఆమె ను వదినగా భావిస్తున్నామని, మళ్ళి పెళ్లి చేసుకుంటే ఆమె పై ఉన్న గౌరవం పోతుందని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీనికి రేణు తీవ్రం గా స్పందించారు.

“ఇలాంటి కామెంట్స్ చదివినపుడు అసలు మనం ఇలాంటి మైండ్‌ సెట్ సమాజంలో బతుకుతున్నాం? అని ఆందోళన కలుగుతోంది. ఒకవైపు, మహిళల సమానత్వం అని పోరాడుతుంటే మరో వైపు ఇటువంటి కుంచిత భావజాలం హద్దులు దాటుతుంది. ఏడు సంవత్సరాలు నేను ఒంటరిగా ఉండి.. ఇప్పుడు నాకు ఒక ఒక లైఫ్ పార్ట్‌నర్ ఉంటే బాగుండేది అని జస్ట్ అన్నందుకే ట్రోల్ చేస్తున్నారు. మన దేశంలో మగాడు ఏమైనా చెయ్యొచ్చు ఎన్ని సార్లైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ అమ్మాయిలు రెండో పెళ్లి చేసుకోకూడదా?ఏ తప్పు లేకున్నా తను లైఫ్ లాంగ్ ఒంటరిగా బతకాలా?” అని ఆవేదన వ్యక్తపరిచారు రేణు దేశాయ్.