అదుర్స్ 2పై ఎన్టీఆర్ మ‌న‌సులో మాట‌..


అదుర్స్.. ఎన్టీఆర్ కెరీర్ లోనే డిఫెరెంట్ సినిమా. ప‌క్కా మాస్ సినిమానే కానీ అందులో చాలా వేరియేష‌న్స్ ఉన్నాయి. ముఖ్యంగా న‌టుడిగా ఎన్టీఆర్ రేంజ్ ఏంటో చూపించిన సినిమా అదుర్స్. ఈయ‌న సినిమాల్లో అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా సీక్వెల్ చేస్తే చూడాల‌నుకునే సినిమా ఒక్క అదుర్స్ మాత్ర‌మే.
వినాయ‌క్ తెర‌కెక్కించిన ఈ చిత్రం 2010లో విడుద‌లైంది. ఈ జ‌న‌రేష‌న్ లో ఆల్ టైమ్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా నిలిచిపోయింది అదుర్స్. చారి పాత్ర ప్రేక్ష‌కుల‌ను క‌డుపులు చెక్క‌లు చేసింది. ఎన్టీఆర్ కెరీర్ లో ఇంత‌కంటే కామెడీ సినిమా లేదు.. ఇంకోటి రాదు కూడా. వినాయ‌క్ కూడా త‌న కెరీర్ లో అదుర్స్ కంటే ఎంట‌ర్ టైనింగ్ మూవీ చేయ‌లేన‌ని చెప్పేసాడు.
ఈ చిత్రానికి సీక్వెల్ చేయాల‌ని చాలా కాలంగా టాక్స్ న‌డుస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ కూడా అదుర్స్ 2పై త‌న అభిప్రాయం చెప్పాడు. ఈ చిత్రంలోని చారి పాత్ర ఓ బ్రాండ్ అని.. దాన్ని మ‌ళ్లీ ముట్టుకోక‌పోవ‌డ‌మే మంచిదంటున్నాడు ఎన్టీఆర్. ఒక‌వేళ సీక్వెల్ చేసినా.. అది పేల‌క‌పోతే అన‌వ‌స‌రంగా చారి పాత్ర‌ను చెడగొట్టిన వాళ్లం అవుతామ‌ని అంటున్నాడు యంగ్ టైగ‌ర్.
ఈ లెక్క‌న అదుర్స్ 2పై ఎన్టీఆర్ కు పెద్ద‌గా ఇష్టం లేదు. అయితే క‌థ కుదిర్తే.. ఇంత మంది అభిమానులు కోరుకుంటున్నారు కాబ‌ట్టి అదుర్స్ 2 చేసినా చేస్తానేమో అంటున్నాడు ఈ హీరో. మ‌రోవైపు వినా య‌క్ మాత్రం స‌రైన క‌థ దొరికితే అదుర్స్ 2 చేస్తామంటూ ప్ర‌క‌టించాడు. మొత్తానికి చూడాలిక‌.. ఈ సినిమా ఉంటుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here