ఆగ‌స్ట్ 3.. ర‌చ్చ రంబోలా..!


ఈ మ‌ధ్య కాలంలో చిన్న సినిమాల ర‌చ్చ ఎక్కువైపోయింది. ఒక్క‌రోజు అర‌డ‌జ‌న్ సినిమాలు కూడా వ‌చ్చేస్తున్నాయి. ఒక్కోసారి మరీ దారుణంగా ప‌ది సినిమాలు కూడా విడుద‌ల‌వుతున్నాయి. ఈ సారి కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంది. మ‌రో వారంలో శ్రీ‌నివాస క‌ళ్యాణం వ‌స్తుంది. దాంతో ఈ వార‌మే చిన్న సినిమాల‌న్నీ క్యూ క‌డుతున్నాయి. ఆగ‌స్ట్ 3న అర‌డ‌జ‌న్ సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇందులో అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తోన్న సినిమాలు చిల‌సౌ.. గూఢాచారి.
నిజానికి ఈ రెండు సినిమాల‌పై ముందు పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ట్రైల‌ర్స్ విడుద‌లైన త‌ర్వాత కానీ వీటిని ప‌ట్టించుకోలేదు ప్రేక్ష‌కులు కూడా. ఇప్పుడు మంచి అంచ‌నాల మ‌ధ్య ఈ రెండు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ముఖ్యంగా గూఢాచారి విజువ‌ల్ వైజ్ గా అద్భుతంగా ఉంది. అడ‌విశేష్ చాలా త‌క్కువ బ‌డ్జెట్ లోనే హై క్వాలిటీతో ఈ సినిమాను తీసుకొస్తున్నాడు. ఇక మ‌రోవైపు చిల‌సౌ కూడా పెళ్లి కాన్సెప్ట్ తో పిచ్చెక్కిస్తుంది.
సుశాంత్ సినిమాపై తొలిసారి కొద్దోగొప్పో ఆస‌క్తి చూపిస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇక వీటితో పాటే మారుతి క‌థ రాసిన బ్రాండ్ బాబు కూడా ఈ వార‌మే వ‌స్తుంది. ఈ మూడు సినిమాల‌తో పాటు మ‌రో మూడు చిన్న సినిమాలు కూడా వ‌స్తున్నాయి. ఇందులో ఎవ‌రు న‌టిస్తున్నార‌నే విష‌యంపై కూడా క్లారిటీ లేదు. మొత్తానికి అర‌డ‌జ‌న్ సినిమాల్లో ఎవ‌రు బాక్సాఫీస్ ను మెప్పిస్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here