ఇదేం ట్విస్ట్ శేఖ‌రా..?


ఒక్క సినిమాతో ప‌దేళ్ల ఫ్లాపుల్ని మ‌రిపించాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. పైగా ఇండ‌స్ట్రీ కూడా హిట్ కొట్టామా లేదా అనేది చూస్తుంది కానీ ఎప్పుడు కొట్టాం.. ఎన్ని రోజులు ఫ్లాపుల్లో ఉన్నాం అనేది చూడ‌దు. ప‌దేళ్ల త‌ర్వాత ఫిదాతో అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దాంతో ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు ఏం చేస్తున్నాడ‌నే విష‌యంపై ఇండ‌స్ట్రీలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఫిదా ముందు వ‌ర‌కు కూడా ఈయ‌న గురించి పెద్ద‌గా ప‌ట్టించుకున్న వాళ్లు లేరు.
కానీ ఇప్పుడు ఈయ‌నేం చేస్తున్నాడో అంద‌రికీ కావాలి. ఆ మ‌ధ్య లీడ‌ర్ 2 చేస్తాన‌న్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. కానీ ఇప్పుడు ఆయ‌న మ‌న‌సు మారింది. మ‌రోసారి ఫిదా త‌ర‌హాలోనే ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడు క‌మ్ముల‌.
ప్ర‌స్తుతం ఈయ‌న ఇంకా క‌థ సిద్ధం చేసే ప‌నిలోనే ఉన్నాడు. ఎన్ని వార్త‌లు వినిపిస్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు త‌ర్వాతి సినిమాపై నోరు విప్ప‌డం లేదు శేఖ‌ర్ క‌మ్ముల‌.
జులై 21కి ఫిదా విడుద‌లై ఏడాది పూర్తి అవుతుంది. అప్ప‌టికి కూడా ఇంకా నోరు విప్పేలా క‌నిపించ‌డం లేదు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఏం చేయాల‌నుకుంటున్నాడు.. ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడు.. ఎవ‌రితో ఈ సినిమా ఉంటుంది అనే విష‌యాల‌పై క్లారిటీ ఇవ్వ‌ట్లేదు శేఖ‌ర్ క‌మ్ముల‌. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ ను తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసే బాధ్య‌త శేఖ‌ర్ క‌మ్ముల తీసుకున్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న గ‌తంలో రానాను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసాడు. ఇప్పుడు ధృవ్ ను తీసుకొస్తున్నాడ‌ని తెలుస్తుంది. మ‌రి ఇందులో నిజం ఎంతుందో క‌మ్ముల చెప్పేవ‌ర‌కు కూడా తెలియ‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here