ఎంసిఏ.. అన్నీ సిద్ధ‌మే.. ఇక యుద్ధ‌మే..

Actress Bhumika’s role from ‘MCA’ is revealed

నాని అనేది ఇప్పుడు పేరు కాదు.. అదో హిట్ మిష‌న్. ఇండియ‌న్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ప‌రుగుల యంత్రం అన్న‌ట్లు.. ఇక్క‌డ నాని కూడా హిట్ల యంత్రం. ఈయ‌న సినిమా చేస్తున్నాడంటే ఎలా ఉంది అని అడ‌గ‌టం మానేసి.. ఎంత వ‌చ్చింది అంటున్నారు. నానిని ఇప్పుడు చిన్న హీరో అంటే ఒప్పుకోవాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎంసిఏ బిజినెస్ చూస్తుంటే క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తున్నాయి. ఈ చిత్రాన్ని వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత‌. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. డిసెంబ‌ర్ 21న‌ ఎంసిఏ విడుద‌ల కానుంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్. నానితో ఈమె జోడీ క‌ట్ట‌డం తొలిసారి. ఇప్ప‌టికే ఫిదాతో సాయిప‌ల్ల‌వి తెలుగు ఇండ‌స్ట్రీని ఫిదా చేసింది. ఇప్పుడు ఈమె సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో కూడా ఆస‌క్తి బాగా పెరిగిపోయింది. ఒక్క సినిమాతోనే.. ఇంకా చెప్పాలంటే తొలి సినిమాతోనే సాయిప‌ల్ల‌వికి అభిమానులు కూడా వ‌చ్చేసారు. ఇలాంటి టైమ్ లో త‌న న్యాచుర‌ల్ యాక్టింగ్ తో ఫిదా చేసిన సాయిప‌ల్ల‌వి.. న్యాచుర‌ల్ స్టార్ తో ఎలా రెచ్చిపోయిందో అని ఆస‌క్తిగా చూస్తున్నారు.
ఇప్ప‌టికే ఎంసిఏ పాట‌లు విడుద‌ల‌య్యాయి. డిసెంబ‌ర్ 12న ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. డిసెంబ‌ర్ 16న ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు.. పాట‌ల‌కు రెస్పాన్స్ అదిరిపోయింది. పైగా ఎంసిఏ ప్రీ రిలీజ్ బిజినెస్ 40 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంది. అస‌లు ఈ బిజినెస్ చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అయిపోతున్నారు. ర‌వితేజ సినిమాల‌కు కూడా ఈ రేంజ్ బిజినెస్ జ‌ర‌గ‌డం లేదిప్పుడు. కానీ నానికి జ‌రిగిపోతుంది. థియెట్రిక‌ల్  బిజినెస్ రూపంలోనే దిల్ రాజుకు 25 కోట్లు వ‌చ్చేస్తున్నాయి. ఇక డిజిటల్ రైట్స్ ను అమేజాన్ 5.50 కోట్ల‌కు ఎగ‌రేసుకుపోయింది. శాటిలైట్ ఎంత లేద‌న్నా 6 కోట్ల‌కు పైగానే రానుంది. మిగిలిన రైట్స్ అన్నీ క‌లిపితే మ‌రో 10 కోట్ల వ‌ర‌కు రానున్నాయి. అంతా కొడితే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించింది 20 కోట్ల‌లోపే. అంటే విడుద‌ల‌కు ముందే నిర్మాత‌కు 20 కోట్ల లాభం అన్న‌మాట‌. ఇప్పుడు చెప్పండి.. నాని సినిమా అంటే స్టార్స్ కు షాకా కాదా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here