ఎన్టీఆర్ కలలోకి వస్తున్నారు, ఆయనే నాకు స్ఫూర్తి అంటున్న ‘సైకో’!

 

రామ్ గోపాల్ వర్మ ఓ సైకో అట, డబ్బు కోసం కులాల మధ్య చిచ్చు పెట్టె రకం అని తాజాగా విమర్శించారు అనంతపూర్ టీడీపీ ఎం.ఎల్.ఏ ప్రభాకర్ చౌదరి. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటించనప్పటినుండి వర్మ ఇటువంటి అనేక విమర్శలు, హెచ్చరికలు ఎదుర్కొంటూనే ఉన్నారు. టీడీపీ నేతలు బాబు రాజేంద్ర ప్రసాద్, సోమిరెడ్డి, అనిత మరియు నటి వాణి విశ్వనాధ్ తీవ్ర నిరసన వ్యక్తపరిచారు. ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం చవి చూడాల్సివస్తదని వర్మ ను హెచ్చరించారు కూడా. వై ఎస్ ఆర్ సి పి నేత రాకేష్ రెడ్డి నిర్మించనున్నారనడం తో ఈ వివాదం మరింత ముదిరింది. వర్మ మాత్రం తన పంద ఏ మాత్రం మార్చుకోకుండా ముందడుగు వేస్తున్నారు. తాజాగా అయన ఈ చిత్రం తీయడానికి మహానుభావుడైన ఎన్టీఅరే స్ఫూర్తి అని, ఆయన రోజు తన కలలోకి వచ్చి స్క్రిప్ట్ వేగంగా పూర్తి చేయడానికి సహకరిస్తున్నారని చెప్పారు వర్మ.