ఎన్ని చేస్తున్నావ్ వెంక‌టేశా..?

Venkatesh

సీనియ‌ర్ హీరోకు మ‌ళ్లీ జోష్ వ‌చ్చింది. ఒకేసారి నాలుగు సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసాడు వెంక‌టేశ్. ఇప్పుడు ఈయ‌న తీరు జోరు చూస్తుంటే షాక్ త‌ప్ప‌దు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ఎఫ్ 2కు ముహూర్తం పెట్టాడు వెంక‌టేశ్. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ జులై 5 నుంచి మొద‌లు కానుంది.

ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ తో క‌లిసి న‌టి స్తున్నాడు వెంక‌టేశ్. ఇక ఈ చిత్రంతో పాటు నాగ‌చైత‌న్య‌తో కూడా ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు వెంకీ. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కించ‌నున్నాడు. వెంకీ మామా టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో నిజంగానే మామ అల్లుళ్లుగా న‌టించ‌బోతున్నారు వెంక‌టేశ్, చైతూ. అబ్బాయి రానాతో కూడా ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు ఈ హీరో.

ఈ విష‌యాన్ని సురేష్ బాబు క‌న్ఫ‌ర్మ్ చేసాడు. వీటితో పాటు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లోనే త్రినాథ‌రావ్ న‌క్కిన‌.. వెంకీ అట్లూరితో కూడా సినిమాలు చేయ‌బోతున్నాడు వెంక‌టేశ్. ఇలా ఒకేసారి నాలుగు సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఇవ‌న్నీ వ‌చ్చే రెండేళ్ల‌లో పూర్తి చేయ‌డానికి చూస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here