ఒక్క క్ష‌ణం రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20171228

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: ఒక్క క్ష‌ణం
న‌టీన‌టులు: అల్లు శిరీష్, సుర‌భి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, సీర‌త్ క‌పూర్ త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: విఐ ఆనంద్
నిర్మాత‌: చ‌క్రి చిగురుపాటి
ఒక్క విజ‌యం సినిమాపై ఎక్క‌డ లేని అంచ‌నాలు పెంచేస్తుంది. అలాంటిది హీరోతో పాటు ద‌ర్శ‌కుడు కూడా హిట్ల‌లో ఉంటే.. ఇక ఆ సినిమాపై  అంచ‌నాలు ఎలా ఉంటాయి..? ఇప్పుడు ఒక్క‌క్ష‌ణంపై ఇవే ఉన్నాయి. దీనికి ముందు అల్లుశిరీష్.. విఐ ఆనంద్ హిట్ల‌లోనే ఉన్నారు. మ‌రి ఈ ఇద్ద‌రూ క‌లిసి మ్యాజిక్ చేసారా.. ఒక్క‌క్ష‌ణం ఎలా ఉంది..?
క‌థ‌:
జీవ (శిరీష్).. జ్యోత్స్న (సురభి)ని అనుకోకుండా ఓ షాపింగ్ మాల్ లో చూస్తాడు. కార్ లో ఉన్న ఆమె.. తొలి చూపులోనే జీవ‌ను ఇష్ట‌ప‌డుతుంది. తానే అడ‌క్కుండా ఫోన్ నెంబ‌ర్ కూడా ఇస్తుంది. ఆ త‌ర్వాత మెల్ల‌గా ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు. వాళ్ల ప్రేమ అలా సాగుతున్న స‌మ‌యంలో అనుకోకుండా వాళ్ల జీవితంలోకి మ‌రో జంట‌ శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) వ‌స్తారు. ఈ ఇద్ద‌రూ రోజూ గొడ‌వ ప‌డుతూనే ఉంటారు. అది అదే అపార్ట్ మెంట్ లోనే ఉండే జ్యో చూస్తుంది. జీవాకు చెప్పి స‌మ‌స్య ఏంటో క‌నుక్కోవాల‌ని చెబుతుంది. అది తెలుసుకునే క్ర‌మంలోనే జీవాకు ఆస‌క్తిక‌ర‌మైన నిజాలు తెలుస్తాయి. త‌మ జీవితంలో జ‌రిగే సంఘ‌ట‌న‌లే.. శ్రీ‌ని, స్వాతి జీవితంలోనూ జ‌రుగుతున్నాయ‌ని తెలుసుకుంటాడు జీవా. అదే స‌మ‌యంలో స్వాతి అనుమానాస్ప‌దంగా చ‌నిపోతుంది. చంపింది కూడా శ్రీ‌నివాసే అని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాంతో త‌న జీవితంలోనూ జ్యో అదే జ‌రుగుతుంద‌ని జీవ‌ను దూరం పెడుతుంది. అస‌లేం జ‌రిగింది.. స్వాతి ఎందుకు చ‌నిపోయింది.. వాళ్ల జీవితంలో జ‌రిగేది వీళ్ల జీవితంలోనూ ఎందుకు జ‌రుగుతుంది అనేది క‌థ‌..
క‌థ‌నం:
తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ఏదో చెప్పాల‌నే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ మంది ఉంటారు. ఉన్న ఆ కాన్సెప్టుల‌నే తీసుకుని.. తిప్పి తిప్పి తీసే ద‌ర్శ‌కులే మ‌న ద‌గ్గ‌ర చాలా మంది ఉంటారు. కానీ విఐ ఆనంద్ మాత్రం కాస్త డిఫెరెంట్. ఈయ‌న కొత్త‌ద‌నం కోసం ట్రై చేస్తుంటాడు. టైగ‌ర్ కానీ.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా కానీ చూస్తే ఈ విష‌యం అర్థ‌మైపోతుంది. ఇక ఇప్పుడు ఈయ‌న మ‌రో కొత్త క‌థ‌తో వ‌చ్చాడు. అదే ప్యార‌ల‌ల్ లైఫ్. ఇద్ద‌రి జీవితాలు ఒకేలా ఉండ‌టం..! అదే ఈ చిత్ర కాన్సెప్ట్. ఒక‌రి ప్ర‌జెంట్.. మ‌రొక‌రి ఫ్యూచ‌ర్ అన్న‌మాట‌. ఇలాంటి కాంప్లికేటెడ్ క‌థ‌ను బాగానే హ్యాండిల్ చేసాడు ఆనంద్. అయితే ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ రేంజ్ లో మాత్రం కాదు. కొరియ‌న్ లో వ‌చ్చిన ప్యార‌ల‌ల్ లైఫ్ సినిమాను ఇక్క‌డ తీసుకొచ్చి.. కొన్ని మార్పులు చేసాడు విఐ ఆనంద్. కాన్సెప్టే ప్యార‌ల‌ల్ లైఫ్ కాబ‌ట్టి.. ఒకే సీన్ ను రెండుసార్లు చూపించాలి త‌ప్ప‌దు. కానీ స్క్రీన్ ప్లే లోపం వ‌ల్ల ఇది కాస్త అక్క‌డక్క‌డా బోర్ ఫీల్ తెప్పిస్తుంది.
తొలి అర‌గంట సుర‌భి, అల్లు శిరీష్ మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు కాస్త నెమ్మ‌దిగా సాగుతున్న ఫీలింగ్ వ‌స్తుంది. అందుకే క‌థ ముందుకు కూడా మెల్ల‌గా సాగుతుంది. ఒక్క‌సారి క‌థ‌లో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ఎంట‌రైన త‌ర్వాత వేగం పుంజుకుంటుంది. అక్క‌డ వాళ్ల జీవితంలో జ‌రిగేది.. ఇక్క‌డ వీళ్ల‌కు కూడా జ‌రుగుతుండ‌టం ఆస‌క్తి రేకెత్తిస్తుంది. ప్రీ ఇంట‌ర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. క‌థ‌పై ఆస‌క్తి పెంచేస్తుంది. సెకండాఫ్ ఏం జ‌రుగుతుందో అనే ఆస‌క్తి పెంపొందిస్తుంది. ఇంట‌ర్వెల్ భ‌లేగా ఉందే అనే ఫీలింగ్ తో బ‌య‌టికి వెళ్లిన ప్రేక్ష‌కులు సెకండాఫ్ లో మాత్రం ఆ స్థాయి ఫీల్ తెప్పించ‌లేదు.  ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర‌హాలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేక‌పోవ‌డం ఈ సినిమాకు మైన‌స్ గా మారింది. శిరీష్, శ్రీ‌ని జీవితాల్లో జ‌రిగే స‌న్నివేశాల‌ను బాగా డిజైన్ చేసుకున్నాడు ఆనంద్. ముఖ్యంగా అవ‌స‌రాల, సీర‌త్ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ బాగున్నాయి. క‌థ‌లో ఈ సీన్స్ అన్నీ ఒక్క‌సారి చూడ్డానికి ఓకే కానీ.. రెండోసారి అవే వ‌స్తుంటే మాత్రం ఆస‌క్తి అనిపించ‌దు. ఇదే క‌దా క‌థ అని ముందే అర్థ‌మైపోతుంటుంది. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో బాగానే హ్యాండిల్ చేసాడు ద‌ర్శ‌కుడు. మ‌ధ్య‌లో మెడిక‌ల్ మాఫియాను కూడా తీసుకొచ్చాడు. ఓవ‌రాల్ గా ఒక్క‌క్ష‌ణం ఊహించినంత లేక‌పోయినా.. కొత్త‌గా ఉంద‌నే ఫీలింగ్ మాత్రం తీసుకొస్తుంది.
న‌టీన‌టులు:
అల్లుశిరీష్ సినిమా సినిమాకు మెరుగ‌వుతున్నాడు. గౌర‌వంలో చూసిన శిరీష్ కు.. ఇప్పుడు ఒక్క‌క్ష‌ణంలో చూసిన శిరీష్ కు చాలా తేడా ఉంది. చాలా ఇంప్రూవ్ కూడా అయ్యాడు. కానీ ఎమోష‌న‌ల్ సీన్స్ లో తేలిపోయాడు. సుర‌భి అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కే స‌రిపోయింది. సీర‌త్ కూడా అంతే. ఇక అవ‌స‌రాల శ్రీ‌నివాస్ క‌థ‌లో కీల‌కంగా మారాడు. ఈయ‌న పాత్ర చాలా బాగుంది. అత‌ను ఉన్నంత సేపూ క‌థ బాగా అనిపిస్తుంది. దాస‌రి అరుణ్ కుమార్ విల‌న్ గా స‌ర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నిక‌ల్ టీం:
మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌నేంటో నిరూపించుకున్నాడు. వింటేజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో కిరాక్ పుట్టించాడు. చాలా సీన్స్ కేవ‌లం ఈయ‌న ఆర్ఆర్ వ‌ల్లే నిల‌బ‌డ్డాయి. పాట‌లు ఆక‌ట్టుకోక‌పోయినా.. బిజి మాత్రం చంపేసాడు. ఇక సినిమాటోగ్ర‌ఫీ శ్యామ్ కే నాయుడు ప‌ర్లేదు. హైద‌రాబాద్ లొకేష‌న్స్ బాగానే చూపించాడు. చోటా కే ప్ర‌సాద్ ఎడిటింగ్ ఓకే. ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ రేంజ్ లో మాయ చేయ‌లేక‌పోయాడు కానీ మ‌రోసారి కొత్త క‌థ‌ను తీసుకుని మెప్పించే ప్ర‌య‌త్న‌మైతే చేసాడు.
చివ‌ర‌గా:
ఒక్క‌క్ష‌ణం.. విధితో పోరాటం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here