CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
కథ :
గౌతమ్ (విష్ణు) ఓటు వేయడానికి అమెరికా నుండి ఇండియా వస్తాడు. సురభి తో ప్రేమలో పడతాడు. అతని ప్రేమని అంగీకరిస్తుంది గాని ఒక కండిషన్ పెడుతుంది సురభి. సురభి తండ్రి నాజర్ ఓ సమాజ సేవకుడు. సంపత్ రాజ్ ఓ సెంటరల్ మినిస్టర్. నాజర్ సంపత్ రాజ్ చేసిన భూ కుంభకోణాన్ని బయటపెడతాడు. తన తండ్రికి, కుటుంబానికి సంపత్ రాజ్ నుండి ప్రాణాపాయం ఉందని తెలిసిన సురభి గౌతమ్ ని ఆశ్రయిస్తుంది. గౌతమ్ ఒక ప్రణాళిక ప్రకారం సంపత్ రాజ్ కు ప్రజాస్వామ్యం బలం ఏమిటో ఓటర్ పవర్ ఏమిటో చూపించాలి నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం సంపత్ రాజ్ కు ఎలా హీరో ఎలా బుద్ధి చెప్తాడు. అతడి చేరనుంది విడిపించిన స్థలాలను పేదల ఇళ్ల నిర్మాణానికి ఎలా అందజేస్తాడో థియేటర్లలో చూడాల్సిందే.
రివ్యూ:
ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుంది ఓటర్ చిత్రం. ‘రీకాల్ ఎలెక్షన్’ అనే పాయింట్ ను హై లైట్ చేస్తూ సాగుతుంది చిత్రం. చిత్రం లో ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ఆలోచింపజేసే అనేక అంశాలను డీల్ చేసాడు దర్శకుడు కార్తీక్ రెడ్డి. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే విష్ణు – సంపత్ రాజ్ మధ్య నడిచే సన్నివేశాలు మాస్ ను ఉర్రుతలూగిస్తాయి. రోమాలు నిక్కబొడిచే పవర్ ఫుల్ డైలాగ్స్ విజిల్స్ వేయిస్తాయి.
విష్ణు గత చిత్రాలకు భిన్నంగా ‘ఓటర్’ చిత్రం పక్కా పొలిటికల్ థ్రిల్లర్ గా సాగుతుంది. విష్ణు కూడా చాలా ఫ్రెష్ గా ఇంటెన్సిటీ తో పెర్ఫర్మ్ చేసాడు. హీరోయిన్ సురభి తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకునిగా సంపత్ రాజ్ అద్భుతంగా చేసాడు. పోసాని కామెడీ టైమింగ్ తో కితకితలు పెడతాడు.
థమన్ మ్యూజిక్ చిత్రంలోని సన్నివేశాలను మరింత రక్తి కట్టిస్తుంది. పాటల చిత్రకరణ రిచ్ గా ఉంటుంది.
చివరిమాట: ఓటర్ వర్ధిల్లాలి
నటీనటులు : విష్ణు మంచు, సురభి, సంపత్ రాజ్
దర్శకత్వం : జి కార్తీక్ రెడ్డి
సంగీతం :యస్ తమన్
నిర్మాత :జాన్ సుధీర్ పూదోట
సినిమాటోగ్రఫర్ :అశ్విన్