కాక పుట్టించిన జాక్వ‌లిన్..

పుట్టింది పెరిగింది శ్రీ‌లంక‌లో.. కానీ స్టార్ డ‌మ్ అనుభ‌విస్తుంది మాత్రం ఇండియాలో. బాలీవుడ్ లో కొన్నేళ్లుగా త‌న‌దైన క్రేజ్ తో ముందుకెళ్తుంది జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్. అందాలకు తోడు వాటిని ఆర‌బోసే గుణం కూడా ఉండ‌టంతో ఈ భామ‌ను బాగానే ద‌త్త‌త తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆరేళ్లైపోయినా ఇప్ప‌టికీ ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతుంది. స‌ల్మాన్ ఖాన్ లాంటి హీరోల అండ ఉండ‌టం ఈమెకు క‌లిసొచ్చే విష‌యం.

ఇప్పుడు కూడా వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్న జాక్వ‌లిన్.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్ల‌తో ఫ్యూజులు ఎగ‌ర‌గొడుతుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. స‌మ్మ‌ర్ చివ‌ర్లో హాట్ ఫోటోస్ తో ట్రీట్ ఇచ్చింది ఈ శ్రీ‌లంక‌న్ బ్యూటీ. ఇప్పుడు కూడా స‌ల్మాన్ తో రేస్ 3లో న‌టించింది ఈ భామ‌. జూన్ 15న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ ప్ర‌మోష‌న్స్ లో భాగంగానే హాట్ ఫోటోస్ తో ర‌చ్చ చేస్తుంది జాక్. ఇవి చూసి కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌ట్లేదు ఇప్పుడు. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్స్ తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తుంది జాక్వ‌లిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here