కీర్తిసురేష్ కొంప ముంచిన మ‌హాన‌టి..

అదేంటి.. ఆ సినిమాతోనే క‌దా.. ఆమె అభిన‌వ మ‌హాన‌టి అయింది. ఈ చిత్రంతోనే క‌దా న‌టిగా కూడా ఎన్నో మెట్లు పైకి ఎక్కింది. ఇలాంటి సినిమాను ప‌ట్టుకుని కొంప ముంచింది అంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు కీర్తిసురేష్ కెరీర్ ను గ‌మ‌నిస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి.

మ‌హాన‌టి లాంటి సినిమా త‌ర్వాత ఏ సినిమా చేసినా కూడా కీర్తికి అంత కిక్ రావ‌డం లేదు. దాంతో ఎలాంటి క‌థ‌లు వ‌చ్చినా నో చెప్పేస్తుంద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా ముందు ఒప్పుకున్న సినిమాలు త‌ప్ప ఇప్పుడు మ‌రో సినిమాలేవీ ఒప్పుకోవ‌డం లేదు కీర్తి. అడిగితే కిక్ రాలేద‌ని స‌మాధానం చెబుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌హాన‌టి లాంటి క‌థ‌లో న‌టించిన త‌ర్వాత అలాంటి కిక్ మ‌ళ్లీ మ‌ళ్లీ రావ‌డం అనేది జ‌ర‌గ‌దు.

ఎందుకంటే ఎవ‌రి కెరీర్ లో అయినా అలాంటి పాత్రలు ఒక్క‌సారే వ‌స్తాయి. అరుంధ‌తి త‌ర్వాత అనుష్క కూడా అలాగే కూర్చుంటే బిల్లా వ‌చ్చుండేది కాదు. కానీ ఇప్పుడు కీర్తిసురేష్ మాత్రం అలా ఆలోచించ‌డం లేదు. అన్నీ మ‌హాన‌టి లాంటి క‌థ‌లు రావాలంటే క‌ష్టం క‌దా. అది ఎప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడు కీర్తి కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డుతుంది. లేదంటే వ‌చ్చిన విజ‌యాన్ని చూసుకుని.. రాని అవ‌కాశాల కోసం చూస్తూ ఉండిపోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here