కీర్తి మ‌ళ్లీ అదే చేస్తుందా..? 


తెలిసో తెలియ‌కో ఒక్క‌సారి మ‌హాన‌టి పాత్ర‌లో న‌టించేసింది కీర్తిసురేష్. ముందు ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి చాలా భ‌య‌ప‌డింది కీర్తి. అస‌లు తానేంటి మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో న‌టించ‌డం ఏంటి..? త‌న వ‌ల్ల కాదు అని వెన‌క‌డుగు వేసింది. కానీ ఎలాగోలా మ‌హాన‌టి పాత్ర‌లో న‌టించ‌డానికి ఒప్పుకుని.. చేసింది ఇప్పుడు దాని ఫ‌లితం మోస్తుంది కీర్తి. ఈ చిత్రం చూసిన త‌ర్వాత ఈమె త‌ప్ప ఇప్పుడు ఎవ‌రూ సావిత్రి పాత్ర‌లో న‌టించ‌లేర‌ని ఫిక్సైపోయారు ప్రేక్ష‌కులు.
చూస్తే సావిత్రి పాత్ర‌లో కీర్తిని మాత్ర‌మే చూడాలి.. లేదంటే లేదు. ఇప్పుడిదే అంతా ఫిక్సైపోయింది. అందుకే ఎన్టీఆర్ బ‌యోపిక్ లో కూడా ఇప్పుడు సావిత్రి పాత్ర కోసం మ‌రోసారి కీర్తిసురేష్ నే ఒప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. క్రిష్ కూడా ఈ విష‌యంలో ముందున్నాడు. ఎలాగైనా కీర్తిని ఒప్పించి ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టింప‌జేయాల‌ని ఆలోచిస్తున్నాడు.
అయితే కీర్తిసురేష్ మాత్రం మ‌రోసారి సావిత్రిగా న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌ట్లేదు. ఒక్క‌సారి న‌టించిన త‌ర్వాత క‌చ్చితంగా ఆ ఎఫెక్ట్ రెండోసారి న‌టిస్తే ప‌డుతుంద‌ని తెలిసి భ‌య‌ప‌డుతుంది. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ఈమెను ఆ పాత్ర కోసం ఎలా ఒప్పిస్తార‌నేది ఆస‌క్తిక‌రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here