`గృహం` చిత్రానికి తిరుగులేని విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు – హీరో సిద్ధార్థ్‌

సిద్ధార్థ్, వయూకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఇటాకి ఎంటర్టైన్మెంట్ బేనర్స్‌పై సిద్ధార్థ్, ఆండ్రియూ తారాగణంగా రూపొందిన హారర్ చిత్రం ’గృహం’.

Thanks to Telugu Audience For Making Gruham A Super Hit- Siddharth

మిలింద్ రావ్ దర్శకుడు. ఈ సినివూ నవంబర్ 17 న విడుదలైంది. `గృహం` పూర్థిస్థాయి హార‌ర్ చిత్రమే కాదు..హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో రూపొందిన చిత్రం. ఈ సినిమాలో సిద్ధార్థ్‌, ఆండ్రియా, అనీషా విక్ట‌ర్‌, అతుల్ కుల‌క‌ర్ణి, సురేష్ స‌హా న‌టీనటులంద‌రి పెర్పామెన్స్‌తో పాటు గిరీష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు వెన్నుముక‌గా నిలిచింది. అలాగే శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్ర‌ఫీ, డిఐ క‌ల‌రింగ్ సినిమా బ్యాక్‌డ్రాప్ తో పాటు ద‌ర్శ‌కుడు మిలింద్ రావ్ తెర‌కెక్కించిన విధానంతో సినిమా చూసిన ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. చాలా రోజుల త‌ర్వాత పూర్తిస్థాయి హార‌ర్ చిత్రంగా విడుద‌లైన `గృహం` విడుద‌లైన అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్‌తో, సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ – “మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎక్క‌డున్నా ఆద‌రిస్తార‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ వెర్ష‌న్స్‌లో విడుద‌లైన మా సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన అందరికీ మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు.

నిర్మాణ సంస్థ‌ల ప్ర‌తినిధులు మాట్లాడుతూ – “తెలుగులో పూర్తిస్థాయి హార‌ర్ చిత్రాలు వ‌చ్చి చాలా కాల‌మైంది. మ‌ళ్లీ అలాంటి డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తే బావుంటుంద‌నే ఆలోచ‌నతో గృహం చిత్రాన్ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాం. అద్భుత‌మైన టెక్నిక‌ల్ టీం ఎఫ‌ర్ట్‌తోనే మంచి సినిమాను ప్రేక్ష‌కులకు అందించాం. ప్రేక్ష‌కులే కాదు రివ్యూస్ రాసిన వారంద‌రూ న‌టీన‌టుల గురించే కాకుండా సాంకేతిక‌త గురించి ప్ర‌శంసిస్తుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. మూడు భాష‌ల్లో మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డం ఆనందంగా ఉంది. సినిమా స‌క్సెస్ భాగ‌మైన వారంద‌రితో పాటు, సినిమా అద్భుతంగా ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌“ అన్నారు.