గోల్డ్ ట్రైల‌ర్.. నిజంగా బంగార‌మే..!

బాలీవుడ్ లో ఇప్పుడు వాస్త‌విక ఘ‌ట‌న‌ల‌కు మంచి డిమాండ్ ఉంది. చ‌రిత్ర‌లో దాగిన సంఘ‌ట‌ల‌ను తీసుకుని వాటికి చిత్రరూపం ఇస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ లిస్ట్ లో అక్ష‌య్ కుమార్ ముందున్నాడు. ఈయ‌న ప్ర‌తీ సినిమాలోనూ రియ‌ల్ ఇన్సిడెంట్స్ ను తీసుకుంటున్నాడు. చ‌రిత్ర‌ను త‌వ్వి విజ‌యాలు అందుకుంటున్నాడు. ఇప్ప‌టికే చాలా సినిమాలు చేసాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఈయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న గోల్డ్ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది కూడా చ‌రిత్రే.

1936 నుంచి 1947 మధ్యలో స్వాతంత్ర్యం కోసం పోరాడే స‌మ‌యంలో జ‌రిగే క‌థ ఇది. అప్పుడు హాకీ జ‌ట్టు క‌థ ఇది. మొదటి హాకీ జట్టును అక్షయ సారథ్యంలో బ్రిటిష్ రాజ్యంలో జాతీయ జెండాను ఎలా ఎగ‌రేసింది అనేది పాయింట్ గా ఈ చిత్రం రూపొందుతుంది. తొలి ఒలంపిక్స్ లో భారత్ కు బంగారు ప‌థ‌కం సాధించిన టీం విజ‌యం ఇది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది.

ఇందులో అక్ష‌య్ కుమార్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్ప‌టికే ఎయిర్ లిఫ్ట్.. టాయ్ లెట్.. రూస్తోం లాంటి సినిమాల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన అక్ష‌య్.. మ‌రోసారి గోల్డ్ తో ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది గోల్డ్. ఈ చిత్రాన్ని రీమాఖ‌ట్గీ తెర‌కెక్కిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here