చ‌ర‌ణ్ మ‌ళ్లీ మొద‌లెట్టాడు బాబోయ్..!

స్టార్ హీరోల సినిమా అంటే ఎప్పుడు మొద‌లై.. ఎప్ప‌టికి పూర్తి అవుతాయో క్లారిటీ ఉండ‌దు. ఎంత ప్లానింగ్ ఉన్నా కూడా మ‌ధ్య‌లో కొన్ని బ్రేకులు అయితే త‌ప్ప‌వు. ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా ఇలాంటి బ్రేక్ తీసుకున్నాడు. కొన్ని రోజులుగా ఈయ‌న న్యూయార్క్ లో ఉన్నాడు.
RAM-CHARAN-NEW-SCEHDULE
భార్య ఉపాస‌న‌తో క‌లిసి అక్క‌డే ఉన్నాడు మెగా వార‌సుడు. ఇప్పుడు ఇండియాకు వ‌చ్చేస్తున్నాడు. వ‌చ్చీ రాగానే బోయ‌పాటి సినిమాతో బిజీ కానున్నాడు. అంద‌రికీ స్వాతంత్ర్యం వ‌చ్చే ఆగ‌స్ట్ 15న మ‌నోడి స్వాతంత్ర్యం పోతుంది.
అంటే మ‌ళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతాడ‌న్న‌మాట‌. ఇప్ప‌టికే స‌గానికి పైగా షూటింగ్ అయిపోయింది ఈ చిత్రానిది. ఇప్పుడు మ‌రో భారీ షెడ్యూల్ కు రంగం సిద్ధం చేస్తున్నాడు బోయ‌పాటి.
ఈ చిత్రానికి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ప‌రిశీలిస్తున్నాడు బోయ‌పాటి శీను. అన్నీ కుదిర్తే ఆగ‌స్ట్ 22న చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల కానుంది. రంగ‌స్థ‌లం లాంటి సినిమా త‌ర్వాత మ‌రోసారి పూర్తి క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో వ‌స్తున్నాడు ఈ హీరో. ఈ చిత్ర బిజినెస్ కూడా 100 కోట్లకు చేరువ‌గానే జ‌రుగుతుంది. డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here