జగన్ సహాయంతో బీజేపీ భారీ వ్యూహం?

వై ఎస్ జగన్ త్రిదండి చిన్న జీయర్ స్వామి ని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. జగన్ హిందూ మత గురువు కి పాదాభివందనం చేయడం, ఆయనతో మంతనాలు చేయడం తో కొంతమంది అవాక్కయ్యారు, మరి కొంతమందికి ఇది మింగుడు పడటంలేదట. వై.ఎస్.ఆర్.సి.పి పార్టీని 2019 లో ఆంధ్రాలో గెలిపించడానికి జగన్ చేస్తున్న విశ్వ ప్రయత్నంలో భాగంగానే చిన్న జీయర్ స్వామి ని కలిసి ఉండవచ్చని. మరో వైపు బీజేపీ ని, ప్రధాని నరేంద్ర మోడీ ని ప్రసన్నం చేసుకోవడానికే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వాదన వినిపిస్తుంది. జగన్ బీజేపీ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని ప్రచారం సాగుతుంది.

బీజేపీ వారు కూడా సుముఖంగానే ఉన్నట్లు వినికిడి. జగన్ కి క్రిస్టియన్ మత ప్రజలలో మంచి ఫాలోయింగ్ ఉన్నందువల్ల, ఆ వర్గాల సపోర్ట్ పొందడానికే జగన్ తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోందట. ఈ విధంగానైనా ఆంధ్ర లో బలపడవచ్చని కూడా బీజేపీ వారి ప్రణాళిక అయ్యి ఉండవచ్చు. దీనికి తోడు మరో వాదన కూడా వినిపిస్తుంది. అది ఏమిటంటే ఆర్.ఎస్.ఎస్ వారు జగన్ సహాయంతో పెద్ద ఎత్తున ఆంధ్రాలో మత మార్పులకు పాల్పడవచ్చని ఆశిస్తున్నట్లు గుసగుస. ఏది నిజమో ఆ జగన్నాటక సూత్రదారికే ఎఱుక.