జగపతిబాబు-నారా రోహిత్ ల “ఆటగాళ్లు” రెగ్యులర్ షూటింగ్ మొదలు

Jagapathi Babu, Nara Rohith Aatagallu Regular Shooting Begins
వెర్సటైల్ ఆర్టిస్ట్స్ జగపతిబాబు-నారా రోహిత్ టైటిల్ పాత్రధారులుగా పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్ “ఆటగాళ్లు” రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది.”గేమ్ విత్ లైఫ్” అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ హైద్రాబాద్ లో ప్రారంభమైంది.
బ్రహ్మానందం మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టిపికల్ స్క్రిప్ట్ తో, వైవిధ్యమైన కథాంశంతో రూపొందనుంది. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పొందేలా సినిమా ఉండబోతోంది. లవ్ కమ్ ఎంటర్ టైన్మెంట్ కూడా పుష్కలంగా ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.
జగపతిబాబు, నారారోహిత్, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాట‌లు: గోపి, కెమెరా: విజ‌య్‌.సి.కుమార్‌, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌, ఆర్ట్: ఆర్‌.కె.రెడ్డి, కార్య‌నిర్వాహ‌క నిర్మాత‌: ఎమ్‌.సీతారామ‌రాజు, కో-డైరెక్టర్: నవీన్ రెడ్డి, నిర్మాత‌లు: వాసిరెడ్డి ర‌వీంద్ర‌, వాసిరెర‌డ్డి శివాజీ, మ‌క్కెన రాము, వ‌డ్ల‌పూడి జితేంద్ర‌, స్కీన్‌ప్లే – ద‌ర్శ‌క‌త్వం: ప‌రుచూరి ముర‌ళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here