టాలీవుడ్ ముద్దుల మావ‌య్య.. చ‌ర‌ణ్..!

అదేంటి ముద్దుల మావ‌య్య అంటే బాల‌కృష్ణ క‌దా.. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ అంటున్నారేంటి అనుకుంటున్నారా..? అది ఒక‌ప్పుడు కానీ ఇప్పుడు మాత్రం ముద్దుల మావయ్య అంటే రామ్ చ‌ర‌ణే. టాలీవుడ్ లో ఉన్న హీరోల పిల్ల‌లంద‌రికీ మావ‌య్య అయిపోయాడు మెగా వార‌సుడు. మొన్న‌టికి మొన్న మ‌హేశ్ బాబు ముద్దుల కూతురు సితార బ‌ర్త్ డే సంద‌ర్భంగా గిఫ్ట్ పంపించాడు చ‌ర‌ణ్.
దానికి సితార నుంచి కూడా థ్యాంక్ యూ అంకుల్ అంటూ రిప్లై వ‌చ్చింది. వెంట‌నే చ‌ర‌ణ్ కూడా సితార‌కు రిప్లై ఇచ్చాడు. ఉపాస‌న‌.. సితార పుట్టినరోజు ఒకటే కావ‌డం మ‌రో విశేషం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ త‌న‌యుడు అభ‌య్ రామ్ పుట్టిన‌రోజుకు కూడా ఇప్పుడు గిఫ్ట్ పంపించాడు చ‌ర‌ణ్. నాన్న‌ను అడిగి తీసుకో అంటూ అభ‌య్ కు అభ‌యం ఇచ్చాడు చ‌ర‌ణ్. గిఫ్ట్ న‌చ్చితే నాకు మ‌ళ్లీ రిప్లై ఇవ్వాలంటూ కోరాడు కూడా. ఇలా హీరోల వార‌సుల‌తో చ‌ర‌ణ్ చాలా బాగా ఆడుకుంటున్నాడు.
ఇక ఇంట్లోనే ఉన్న పిల్ల‌ల‌తో కూడా అలాగే ముద్దుల మావ‌య్య అనిపించుకుంటున్నాడు ఈ హీరో. బ‌న్నీ కొడుకుకు ఆ మ‌ధ్య రంగ‌స్థ‌లం డ్ర‌స్ పంపించి సూప‌ర్ మామా అనిపించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి.. ముద్దుల మావ‌య్య చ‌ర‌ణ్ కాదంటారా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here