టీజర్‌ చాలా ఇంప్రెసివ్‌గా వుంది.. సినిమా మంచి సక్సెస్‌ అవుతుంది – ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

డిఫరెంట్‌ కథా చిత్రాలతో రూపొందిన ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’, ‘గరుడవేగ’ చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో మన అందరికీ తెల్సిందే. మళ్లీ అదే కోవలో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ‘కిస్‌ కిస్‌ బ్యాంగ్‌ బ్యాంగ్‌’. ధృవ ప్రొడక్షన్స్‌ పతాకంపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ మేడికొండ దర్శకత్వంలో యువ నిర్మాత సుజన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కిస్‌ కిస్‌ బ్యాంగ్‌ బ్యాంగ్‌’. ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమం నవంబర్‌ 8న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఆత్మీయ అతిథుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర టీజర్‌ని రిలీజ్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు జె.సాంబశివరావు, రాజ్‌ కందుకూరి, అంజాద్‌ బాబు, రైటర్‌ ఆకెళ్ల, నటులు కిరణ్‌, మహేష్‌ కత్తి, రవికాంత్‌, నటి గాయత్రి గుప్తా, దర్శకుడు కార్తీక్‌ మేడికొండ, నిర్మాత సుజన్‌, సంగీత దర్శకుడు జి.వి. సినిమాటోగ్రాఫర్‌ సిద్ధ కె. ఎడిటర్‌ గోవింద్‌ దిట్టకవి తదితరులు పాల్గొన్నారు.

Kiss Kiss Bang Bang Teaser is impressive
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ”వన్‌ ఇయర్‌ బ్యాక్‌ సినిమా తీద్దామని కార్తీక్‌, సుజన్‌ మా ఆఫీస్‌కి వచ్చారు. వీళ్ళు ఏం తీస్తారులే అని అనుకున్నాను. సడెన్‌గా మొన్న వచ్చి సినిమా కంప్లీట్‌ అయ్యింది అని చెప్పి కొన్ని సీన్స్‌, టీజర్స్‌ చూపించారు. చూడగానే షాక్‌ అయ్యాను. చాలా ఇంప్రెసివ్‌గా వున్నాయి. మంచి సినిమా తీసి వుంటారు అన్పించింది. కొత్త తరహా సబ్జెక్ట్‌ ఇది. టైటిల్‌ చాలా గమ్మత్తుగా వుంది. డెఫినెట్‌గా మంచి సక్సెస్‌ అవుతుంది” అన్నారు.
ప్రముఖ నిర్మాత జె.సాంబశివరావు మాట్లాడుతూ – ”ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అయి నిర్మాత సుజన్‌కి బాగా డబ్బులు రావాలి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.
నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ – ”డైరెక్టర్‌ కార్తీక్‌కి టెక్నికల్‌గా మంచి నాలెడ్జ్‌ వుంది. టీజర్స్‌ చూశాను. బ్యూటిఫుల్‌గా వుంది. కొత్త రకమైన కాన్సెప్ట్స్‌తో తెలుగు సినిమాలు రావాలనేది నా కోరిక. వెరీ వెరీ డిఫరెంట్‌ జోనర్‌ ఫిల్మ్‌ ఇది. ఇలాంటి ఫిలింస్‌ ఆడియన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి. సుజన్‌ నిర్మాతగా సక్సెస్‌ కావాలి” అన్నారు.
రచయిత ఆకెళ్ల రాఘవ మాట్లాడుతూ – ”ఫైవ్‌ ఇయర్స్‌ బ్యాక్‌ కార్తీక్‌ నాతో పాటు వర్క్‌ చేశాడు. మంచి టాలెంటెడ్‌ పర్సన్‌. ప్రతిది కొత్తగా ఆలోచిస్తుంటాడు. ఈ సినిమా హిట్‌ అయ్యి డైరెక్టర్‌గా కార్తీక్‌ మరిన్ని మంచి చిత్రాలు చెయ్యాలి. సీరియస్‌గా కాకుండా సిన్సియర్‌గా వర్క్‌ చేస్తే ఏ సినిమా అయినా మంచి ఫలితాన్ని ఇస్తుంది” అన్నారు.
కత్తి మహేష్‌ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్‌లో నటించాను. ఒక కొత్త ప్రయత్నంతో ఈ సినిమా చేశాను. కథ వినకుండా డైరెక్టర్‌ మీద నమ్మకంతో సుజన్‌ ఈ సినిమా చేశాడు. వెరీ డిఫరెంట్‌ జోనర్‌ ఫిల్మ్‌ ఇది” అన్నారు.
నటుడు కిరణ్‌ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాను. మా టీమ్‌ అంతా ఒక ఫ్యామిలీలా కలిసి వర్క్‌ చేశాం. మా ఫ్రెండ్స్‌ అంతా కలిసి టు ఇయర్స్‌గా ట్రావెల్‌ అవుతూ ఈ సినిమా చేశాం. రియాలిటీకి దగ్గరగా, ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రం వుంటుంది” అన్నారు.
దర్శకుడు కార్తీక్‌ మేడికొండ మాట్లాడుతూ – ”నా మీద నమ్మకంతో కథ కూడా వినకుండా సినిమా తీయడానికి ముందుకు వచ్చిన మా సుజన్‌కి నా థాంక్స్‌. ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ ఎప్పటికీ గుర్తుంటుంది. టీజర్‌తో పాటు సినిమా కూడా అందరికీ నచ్చుతుంది” అన్నారు.
చిత్ర నిర్మాత సుజన్‌ మాట్లాడుతూ – ”రెగ్యులర్‌ ఫార్మెట్‌లో కాకుండా డిఫరెంట్‌ జోనర్‌లో రియలిస్టిక్‌గా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా చూసి బయటికి వస్తారు. ఆ అటెంప్ట్‌లో సక్సెస్‌ అయ్యామని మా నమ్మకం” అన్నారు.
కిరణ్‌, హర్షద కులకర్ణి, మహేష్‌ కత్తి, గాయత్రి గుప్తా, రవికాంత్‌, సందీప్తి, ప్రవీణ్‌, ఆదిత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధ కె, ఎడిటింగ్‌: గోవింద్‌ దిట్ట కవి, సంగీతం: జి.వి, కాస్ట్యూమ్స్‌: రేఖ బొగ్గరపు, ఆర్ట్‌: ప్రాణ మణికంఠ, నిర్మాత: సుజన్‌, రచన, దర్శకత్వం: కార్తీక్‌ మేడికొండ.