టైగ‌ర్ హంటింగ్.. మాటల్లేవు.. అన్నీ కోట్లే..!

Salman Khan Loukyam

ఒక్క సినిమా ఫ్లాప్ అయితే త‌గ్గిపోయే ఇమేజ్ కాదు ఆయ‌న‌ది.. ఒక్క ఫ్లాప్ తో ప‌డిపోయే మార్కెట్ కాదు ఆయ‌న‌ది.. ప‌ది ఫ్లాపులు వ‌చ్చినా ప‌ద‌కొండో సినిమాతో రికార్డులు కొట్టే ఇమేజ్ స‌ల్మాన్ ఖాన్ సొంతం. ఇండియాలో ఎంత‌మంది హీరోలున్నా.. బాక్సాఫీస్ కింగ్ మాత్రం కండ‌ల‌వీరుడే. ఇది ఇప్ప‌టికే నిరూపిత‌మైంది. ముఖ్యంగా మాస్ లో ఈ హీరో ఫాలోయింగ్ చూస్తే మెంట‌ల్ వ‌చ్చేస్తుంది. బాలీవుడ్ లో వ‌ర‌స‌గా 11 సార్లు 100 కోట్ల సినిమాలు ఇచ్చిన రికార్డ్ స‌ల్మాన్ సొంతం. ఇప్పుడు 12వ సారి ఆ ఫీట్ చేసాడు స‌ల్మాన్ ఖాన్. ఈయ‌న న‌టించిన టైగ‌ర్ జిందా హై మూడు రోజుల్లోనే 114 కోట్లు వ‌సూలు చేసింది. అలీ అబ్బాస్ జాఫర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఏ, బి, సి సెంట‌ర్లు అని తేడా లేకుండా అన్ని చోట్లా ఇర‌గ‌దీస్తోంది. తొలిరోజు 34.. రెండో రోజు 35 కోట్లు వ‌సూలు చేసిన టైగ‌ర్.. మూడో రోజు మాత్రం రికార్డులు తిర‌గ‌రాసింది. ఏకంగా 45 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి.. బాలీవుడ్ లో హైయ్య‌స్ట్ సింగిల్ డే రికార్డ్ సృష్టించాడు స‌ల్మాన్ ఖాన్. దాంతో మూడు రోజుల్లోనే టైగ‌ర్ లెక్క 114 కోట్ల‌కు చేరిపోయింది. అలీ అబ్బాస్ తో స‌ల్మాన్ గ‌తంలో చేసిన సుల్తాన్ కూడా 600 కోట్లు వ‌సూలు చేసింది. ద‌బంగ్ నుంచి మొద‌లుకొని రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగ‌ర్, ద‌బంగ్ 2, జైహో, కిక్, భ‌జ‌రంగీ భాయీజాన్, ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో, సుల్తాన్, ట్యూబ్ లైట్.. వ‌ర‌స‌గా 100 కోట్ల క్ల‌బ్ లో చేరాయి. తాజాగా 12వ సారి 100 కోట్లు కొల్ల‌గొట్టాడు స‌ల్మాన్. బాలీవుడ్ లో అత్య‌ధిక బిలియ‌న్ సినిమాలున్న హీరో కూడా స‌ల్మానే. సుల్తాన్ జోరు చూస్తుంటే మ‌రో 300 కోట్ల సినిమా వ‌చ్చేలా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here