ట‌చ్ చేసి చూడు.. క‌రెంట్ తీగ అక్క‌డ‌..!

క‌రెంట్ తీగ కూడా స‌న్న‌గా ఉంటుంది.. కానీ ముట్టుకుంటే దానమ్మ షాకే. ఇప్పుడు ర‌వితేజ కూడా ఇదే అంటున్నాడు. ఈయ‌న ట‌చ్ చేసి చూడు సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. అస‌లు ఈ లుక్ లో ర‌వితేజ‌ను చూస్తుంటే నిజంగానే మ‌నం చూస్తున్న‌ది మాస్ రాజానేనా అనే అనుమానం వ‌స్తుంది. ఒక‌ప్పుడు కాస్త బొద్దుగా క‌నిపించిన ర‌వితేజ‌.. ఇప్పుడు మ‌రీ క‌రెంట్ తీగ‌లా మారిపోయాడు. ఈ లుక్ చూస్తుంటేనే సినిమా ఎంత మాస్ గా ఉండ‌బోతుందో అర్థ‌మ‌వుతుంది. పైగా మాస్ రాజా కూడా ఫుల్ ప‌టాసే. కొత్త ద‌ర్శ‌కుడైనా ఈ విష‌యాన్ని ఇట్టే ప‌ట్టాడు విక్ర‌మ్ సిరి. ట‌చ్ చేసి చూడులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు ర‌వితేజ‌. ఈయ‌న వాలకం చూస్తుంటే సినిమాలో నిజంగానే ఎవ‌రైనా ట‌చ్ చేస్తే వాళ్ల అంతు చూసే వ‌ర‌కు వ‌దిలేలా లేడు. ఇప్పుడు ట‌చ్ చేసి చూడు ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లు. డిసెంబ‌ర్ లో షూటింగ్ పూర్తి చేసి.. జ‌న‌వ‌రి 25న సినిమా విడుద‌ల కానుంది. ఆ మ‌రుస‌టి రోజు ర‌వితేజ పుట్టిన‌రోజు. ఒక‌రోజు ముందే ఫ్యాన్స్ కు బ‌ర్త్ డే ట్రీట్ ఇవ్వ‌నున్నాడు మాస్ రాజా. ఈ చిత్రానికి వ‌క్కంతం వంశీ  క‌థ అందిస్తున్నాడు. మొత్తానికి ఈ ఫ‌స్ట్ లుక్ చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు మాత్రం మ‌రింత పెర‌గ‌డం ఖాయం. చూడాలిక‌.. ర‌వితేజ‌ను ట‌చ్ చేస్తే ఏమ‌వుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here