డిసెంబరు 1న హీరో నందు” కన్నుల్లో నీ రూపమే”….

hero nandu kannulo nee ropam
Asp క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో యువ నటుడు నందు, తేజస్విని ప్రకాష్ జంటగా రూపొందుతున్న చిత్రం కన్నుల్లో నీ రూపమే..హృదయాన్ని హత్తుకునే స్వచ్ఛమైన కథాశం తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు చిత్ర యూనిట్.
ఇటీవలే సాకేత్ అందించిన సంగీత సారధ్యంలో  విడుదలైన ఈ సినిమా పాటలు  యూట్యూబ్ లో మంచి స్పందన రావడం విశేషం. హీరో  నందు నటన, సాకేత్ బీజీయం, చిత్ర  కథనం కథాంశాలు అంశాలు ఈ చిత్రానికే హై లెట్ గా నిలవ నున్నాయి,  మనసును కదిలించే సన్నివేశాలతో పాటు ఎంటర్త్సైన్మెంట్ సమపాలల్లో ఉంటూ అన్నీ  వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా  దర్శకుడు బిక్స్ మలిచారు, త్వరలో కొత్త ట్రైలరును విడుదల చేసి నవంబర్ ఆఖరున చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.