తేజ్ ను బాగానే అమ్మేసారుగా..!


ఎవ‌రండి వ‌ర‌స ఫ్లాపులు వ‌స్తే హీరోల ఇమేజ్ ప‌డిపోతుంద‌ని చెప్పింది..? అలాంటి వాళ్ల‌కు ఒక్క‌సారి సాయిధ‌రంతేజ్ ను చూపించండి. ఈ హీరోకు వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు ఉన్నాయి. ఒక‌దాన్ని మించి మ‌రో సినిమా బ‌య్యర్ల‌ను ముంచేసింది. అయినా గానీ మ‌ళ్లీ ఇప్పుడు ఈయ‌న కొత్త సినిమాను ఎగ‌బ‌డి కొన్నారు బ‌య్య‌ర్లు.
అలాగ‌ని ద‌ర్శ‌కుడైనా ఫామ్ లో ఉన్నాడా అంటే అదీ లేదు. అయినా కూడా సాయిధ‌రంతేజ్ కొత్త సినిమా తేజ్ ఐ ల‌వ్యూ ను 17 కోట్ల‌కు కొన్నారు.. శాటిలైట్ రైట్స్ రూపంలోనే సినిమాకు 7.5 కోట్లు వచ్చాయి. మ‌న సినిమాల‌కు హిందీలో ఉన్న డిమాండ్ తెలుసు కాబ‌ట్టి హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కు కూడా మంచి రేట్ ప‌లికింది.
ఇక మ్యూజిక్ రైట్స్ తో కూడా క‌లిపితే విడుద‌ల‌కు ముందే నిర్మాత కేఎస్ రామారావుకు తేజ్ ఐ ల‌వ్యూ నుంచి 5 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వ‌చ్చింది. ఇదే ఇప్పుడు ట్రేడ్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. జులై 6న ఈ సినిమా విడుద‌ల కానుంది. క‌రుణాక‌ర‌ణ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంతో క‌చ్చితంగా హిట్ ట్రాక్ ఎక్కుతానంటున్నాడు సాయి. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కాన్ని తేజ్ ఎంత‌వ‌ర‌కు నిల‌బెడ‌తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here