తొలిప్రేమ‌ సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20180210

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: తొలిప్రేమ‌
న‌టీన‌టులు: వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా, ప్రియ‌ద‌ర్శి, సుహాసిని, సీనియ‌ర్ న‌రేష్..
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌కుడు: వెంకీ అట్లూరి
నిర్మాత‌: బివిఎస్ఎన్ ప్ర‌సాద్
తొలిప్రేమ లాంటి క్లాసిక్ టైటిల్ ను కొత్త ద‌ర్శ‌కున్ని న‌మ్మి ఇచ్చాడు వ‌రుణ్ తేజ్. అత‌డి క‌థ‌ను న‌మ్మి ముందడుగేసాడు. మ‌రి ఈ తొలిప్రేమ‌లో నిజంగా ఆ తొలిప్రేమ‌కు ఉన్నంత విష‌యం ఉందా..? ఆ టైటిల్ ను వ‌రుణ్ నిల‌బెట్టాడా.. చెడ‌గొట్టాడా..? అస‌లు ఎలా ఉంది ఈ తొలిప్రేమ‌.. మ‌న‌సును క‌దిలించిందా..?
క‌థ‌: 
ఆదిత్య‌(వ‌రుణ్ తేజ్) ఇంజ‌నీరింగ్ స్టూడెంట్. ఓ రోజు ట్రైన్ లో ఊరు వెళ్తూ వ‌ర్ష‌(రాశీఖ‌న్నా) ను చూస్తాడు. ఆదిత్య‌ను ఓ ప్ర‌మాదం నుంచి కాపాడుతుంది వ‌ర్ష‌. ఆమెను చూసిన తొలి క్ష‌ణంలోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు ఆదిత్య‌. ధైర్యంగా మ‌న‌సులో మాట చెప్పేస్తాడు. కానీ వ‌ర్ష మాత్రం ఏం చెప్ప‌కుండా ఆదిత్య‌ను వ‌దిలేసి వెళ్లిపోతుంది. త‌ర్వాత ఆమె కోసం ఎన్నో చోట్ల వెతుకుతాడు ఆది. అంత‌లోనే తాను చ‌దివే కాలేజ్ లోనే వ‌ర్ష మ‌ళ్లీ అక్క‌డ ప్ర‌త్య‌క్షం అవుతుంది. దాంతో ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారుతుంది. కానీ ఆది కోపంతో వ‌ర్ష అత‌డికి దూరం అవుతుంది. వెంట‌నే ఆదిత్య కూడా త‌న ప్రేమ‌ను వ‌దిలేసి వ‌ర్ష‌కు దూరంగా వెళ్లిపోతాడు. ఆరేళ్ల త‌ర్వాత వ‌ర్ష మ‌ళ్లీ ఆదిత్య జీవితంలోకి వ‌స్తుంది. అస‌లు వాళ్లిద్దరూ ఎలా క‌లిసారు.. అస‌లు ఎందుకు విడిపోయారు అనేది అసలు క‌థ‌.
క‌థ‌నం:
ప్రేమ‌.. మ‌న‌ల్ని.. మ‌న‌సుల్ని ఎప్పుడూ వెంటాడే ఓ ఫీలింగ్. జ్ఞాప‌కాలు తీపైనా.. చేదైనా మ‌నుసు మాత్రం వీడిపోవు. ఎప్పుడు చూసినా.. ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ గానే అనిపిస్తాయి. కాక‌పోతే ఆ ప్రేమను చెప్పే తీరు.. చూపించే దారి మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఉండాలంతే. ఈ విష‌యంలో కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఆరితేరిపోయాడు. తొలి సినిమానే అయినా ఎమోష‌న్స్ అద్భుతంగా పండించాడు. తెలిసిన క‌థనే మ‌రింత‌ అందంగా చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. చాలా సినిమాల్లో మ‌నం చూసిన స‌న్నివేశాలే కానీ.. తొలిప్రేమ‌లో మాత్రం అవ‌న్నీ చాలా రీ ఫ్రెషింగ్ గా అనిపించాయి. వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ట్రైన్ సీక్వెన్స్.. కాలేజ్ సీక్వెన్స్.. లీడ్ పెయిర్ మ‌ధ్య ల‌వ్ సీన్స్.. వీటితో ఫ‌స్టాఫ్ చాలా ఎంట‌ర్ టైనింగ్ గా వెళ్లిపోయింది. సెకండాఫ్ అంతా ఎమోష‌న్స్ పై దృష్టి పెట్టాడు వెంకీ అట్లూరి. అక్క‌డ కూడా ఎంట‌ర్ టైన్మెంట్ లోటు లేకుండా హైప‌ర్ ఆది, ప్రియద‌ర్శిని క‌థ‌లో క‌లిపేసాడు. ప్రేమ‌లో వ‌చ్చే చిన్న చిన్న గొడ‌వ‌లు.. ఇగోలు.. మ‌న‌సును ఎలా హ‌ర్ట్ చేస్తాయో సున్నితంగా చూపించాడు వెంకీ అట్లూరి.
వెంకీ అట్లూరి సున్నిత‌మైన క‌థ‌ను అంత‌కంటే సున్నితంగా మ‌న‌సుకు హ‌త్తుకునేలా తెర‌కెక్కించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు ప్రాణం. రొటీన్ అనిపించినా కూడా త‌న మాట‌ల‌తో సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు వెంకీ అట్లూరి. ప్రేక్ష‌కుల్ని క‌న్విన్స్ చేయ‌గ‌లిగాడు. మ‌నం జీవితంలో రోజూ ప‌డే చిలిపి త‌గాదాల‌నే చూపించి.. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా చేసాడు వెంకీ అట్లూరి. తొలి సీన్ నుంచే వాళ్ల ప్రేమ‌కు స్ట్రాంగ్ బేస్ మెంట్ వేసాడు. ఆ త‌ర్వాత కాలేజ్ లో వెంకీ రాసుకున్న ప్ర‌తీ సీన్ ఆక‌ట్టుకుంటుంది. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు సినిమా బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్లింది. సెకండాఫ్ అంతా ఎమోష‌న్స్ పై ఎక్కువ‌గా దృష్టి పెట్టాడు వెంకీ. అప్ప‌టి వ‌ర‌కు కుర్ర త‌నంగా అనిపించిన ల‌వ్.. సెకండాఫ్ లో మెచ్యూర్డ్ గా మారుతుంది. కెరీర్ లో సెటిలైన త‌ర్వాత వ‌చ్చిన ప్రేమ‌ను చాలా అందంగా చూపించాడు వెంకీ. చిలిపి త‌గాదాల‌తో స‌ర‌దాగా వెళ్లిపోయింది క‌థ‌. క్లైమాక్స్ అర‌గంట సినిమాకు ప్రాణం. సున్నిత‌మైన అంశాన్ని అంతకంటే సున్నితంగా రాసుకున్నాడు వెంకీ అట్లూరి.
న‌టీన‌టులు: 
ఫిదాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు కానీ న‌టుడిగా మాత్రం ఊహించిన మార్కులు రాలేదు వ‌రుణ్ తేజ్ కు. దానికి కార‌ణం సాయిప‌ల్ల‌వి. ఆమె ముందు తేలిపోయింది ఈ పాత్ర‌. కానీ ఇప్పుడు అలా కాదు. స్టూడెంట్ గా కోపం, అగ్రెసివ్ చూపిస్తూనే.. లైఫ్ లో సెటిలైన త‌ర్వాత మెచ్యూరిటీ చూపించాడు. ల‌వ‌ర్ బాయ్ గా అద్భుతంగా న‌టించాడు వ‌రుణ్. కొన్ని సీన్స్ లో ప‌వ‌న్ ను గుర్తుకు తెచ్చాడు ఈ హీరో. డాన్సులు కూడా కుమ్మేసాడు వ‌రుణ్ తేజ్. ఇక రాశీఖ‌న్నా కూడా కెరీర్ బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రియ‌ద‌ర్శి ఉన్నంతలో బాగా న‌వ్వించాడు. హైప‌ర్ ఆది సెకండాఫ్ లో ప‌ర్లేదు. కానీ అక్క‌డ కూడా జ‌బ‌ర్దస్థ్ పంచ్ లే వేసాడు. సుహాసిని కొన్ని సీన్స్ లోనే క‌నిపించినా బాగా చేసింది. న‌రేష్ కులం పిచ్చి బాగుంది.
టెక్నిక‌ల్ టీం: 
తొలిప్రేమ‌కు ప్రాణం థ‌మ‌న్ సంగీతం. ఆయ‌న పాట‌లే సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ మ‌ధ్య రొటీన్ మ్యూజిక్ తో విమ‌ర్శ‌లు అందుకున్న థ‌మ‌న్.. ఈ సారి మాత్రం ఫుల్ మార్కులు కొట్టేసాడు. ముఖ్యంగా ఆర్ఆర్ అద్భుతం. చాలా సీన్ల‌ను త‌న సంగీతంతో నిల‌బెట్టాడు థ‌మ‌న్. జార్జ్ విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. లండ‌న్ లోని లొకేషన్స్ అందంగా చూపించాడు. వెంకీ అట్లూరి తొలి సినిమానే అయినా చాలా మెచ్యూర్డ్ స్క్రిప్ట్ తో వ‌చ్చాడు. దాన్ని అంత‌కంటే అందంగా తెర‌కెక్కించాడు.
చివ‌ర‌గా:
తొలిప్రేమ‌.. అంద‌మైన ప్రేమ ప్ర‌యాణం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here