నవంబర్ 10న నారా రోహిత్ “బాలకృష్ణుడు” ఆడియో విడుదల నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల

స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ సంయుక్తంగా  నారా రోహిత్‌-రెజీనా జంటగా డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `బాల‌కృష్ణుడు`. బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్ శ్రీ వినోద్ నంద‌మూరి, మాయా బ‌జార్ మూవీస్ సినిమా నిర్మాత‌లు. ఇటీవల విడుదలైన సినిమా ఫ‌స్ట్‌లుక్‌ కు విశేషమైన స్పందన లభించింది. సిక్స్ ప్యాక్ లుక్ లో నారా రోహిత్ ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచాడు. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను నవంబర్ 10న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నారు. అలాగే చిత్రాన్ని నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు.
nara rohit balakrishnudu audio launch and release date
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి మాట్లాడుతూ – “నారా రోహిత్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా `బాల‌కృష్ణుడు` యాక్ష‌న్‌, రొమాన్స్‌, అద్భుత‌మైన పాట‌లు ఇలా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా కోసం తొలిసారి నారారోహిత్ సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. ప‌వ‌న్ మ‌ల్లెల సినిమాను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా అద్భుతంగా తెర‌కెక్కించారు. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ఈనెల 10వ తారీఖున ఘనంగా ఆడియో వేడుక నిర్వహించనున్నాం. అలాగే నవంబర్ 24న చిత్రాన్ని విడుదల చేయనున్నాం” అన్నారు.
నారారోహిత్‌, రెజీనా కసండ్ర‌, ర‌మ్య‌కృష్ణ‌, పృథ్వీ, ఆదిత్య మీన‌న్, కోట శ్రీనివాస‌రావు, దీక్షాపంత్‌, పియా బాజ్‌పాయ్‌, అజ‌య్‌, తేజ‌స్విని, శ్రావ్య రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, శివ‌ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, రామారాజు, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి స్టంట్స్ః విజ‌య్‌, కాస్ట్యూమ్స్ః న‌ర‌సింహారావ్‌, ఆర్ట్ః ఆర్‌.కె.రెడ్డి, గ్రాఫిక్స్ః మేట్రిక్స్ వి.ఎఫ్‌.ఎక్స్‌, క‌థ‌, మాట‌లుః కొలుసు రాజా, మ్యూజిక్ః మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః విజ‌య్ సి.కుమార్‌, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, లైన్ ప్రొడ్యూస‌ర్ః డి.యోగానంద్‌, నిర్మాత‌లుః బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః ప‌వ‌న్ మ‌ల్లెల‌.