నాని-సాయిప‌ల్ల‌వి.. రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదుగా.. 

MCA Pre Release Event Photos (1)
వెండితెర‌పై ఇద్ద‌రు న్యాచుర‌ల్ స్టార్స్ ఒకేసారి ప‌ర్ఫార్మ్ చేస్తుంటే చూడ్డానికి నిజంగానే రెండు క‌ళ్లు స‌రిపోవు. ఇప్పుడు సాయిప‌ల్ల‌వి.. నాని జోడీని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒకరి కోసం ఒక‌రు అన్న‌ట్లుగా ఇద్ద‌రూ చించేస్తున్నారు. విడుద‌లవుతున్న స్టిల్స్.. వ‌చ్చిన పాట‌లు.. చూస్తున్న ట్రైల‌ర్ ఇలా అన్నింట్లోనూ నాని.. సాయిప‌ల్ల‌వి నువ్వా నేనా అన్న‌ట్లుగా ఉన్నారు. ఇప్పుడు విడుద‌లైన ఏమైందో తెలియ‌దు నాకు పాట‌లోనూ వీళ్లిద్ద‌రి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇది చూస్తుంటే క‌చ్చితంగా రేపు సినిమాలోనూ వీళ్ల మాయ కొన‌సాగ‌డం ఖాయం. ఇద్ద‌రు న్యాచుర‌ల్ యాక్ట‌ర్స్ తెర‌పై క‌నిపిస్తే ఎలా ఉంటుందో ఎంసిఏ చూస్తుంటే అర్థ‌మైపోతుంది. అన్నింట్లోను సాయిప‌ల్ల‌వి, నాని మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.
ఇక ఇప్పుడు ఏమయిందో నాకు అనే పాట విడుద‌లైంది. ఈ పాట‌లోనూ ఇద్ద‌రి రొమాన్స్ అదిరిపోయింది. మొన్న విడుద‌లైన కొత్త‌గా కొత్త‌గా సాంగ్ కూడా చాలా పెద్ద హిట్టైంది. ఇందులోనూ నాని, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఇక ఇప్పుడు వ‌చ్చిన పాట‌లోనూ ఇదే సీన్ రిపీట్ చేసాడు ఈ జోడీ. దాంతో ఎంసిఏపై ఆస‌క్తితో పాటు అంచ‌నాలు కూడా చాలా పెరిగాయి. మ‌ధ్య త‌ర‌గ‌తి బంధాలు, అనుబంధాలే మెయిన్ బేస్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్. మొత్తానికి ఎంసిఏ మ్యూజిక్ ప‌రంగా సూప‌ర్ హిట్. డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి చూడాలిక‌.. ఈ ఇద్ద‌రు న్యాచుర‌ల్ యాక్ట‌ర్స్ క‌లిసి ఎంసిఏ రేంజ్ ను ఏ రేంజ్ కు తీసుకెళ్ల‌నున్నారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here