ఇటీవలే “కిరాక్ పార్టీ”తో డీసెంట్ హిట్ అందుకొన్న నిఖిల్ తన తదుపరి చిత్రంగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఠాగూర్ మధు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది.
ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రానికి “ముద్ర” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సెట్స్ కు వెళ్లడానికి ముందే శాటిలైట్ రైట్స్ కు భారీ ధర పలకడం విశేషం. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ చానల్ “స్టార్ మా” నిఖిల్ నటిస్తున్న “ముద్ర” శాటిలైట్ (తెలుగు, హిందీ) రైట్స్ ను ఏకంగా 5.5 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొంది.
నిఖిల్ కెరీర్ లో ఒక సినిమా సెట్స్ కు వెళ్లకముందే శాటిలైట్ రైట్స్ అమ్ముడవ్వడం అనేది ఇప్పటివరకూ ఎప్పుడు జరగలేదు. అది కూడా ఇంత భారీ ధర పలకడం అనేది ప్రప్రధమం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ మరియు ఆర్టిస్ట్స్-టెక్నీషియన్స్ ను ఫైనల్ చేయడంలో బిజీగా ఉన్న చిత్రబృందం త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.