నితిన్ కు గ‌తం గుర్తొస్తుందా..? 

Nithin
సెకండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతున్న టైమ్ లో ప్ర‌యోగాలు చేసాడు నితిన్. అప్పుడు కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్ అంటూ ఓ సారి.. హార్ట్ ఎటాక్ అని మ‌రోసారి.. ఈ మ‌ధ్యే లై అని ఇంకోసారి.. ఇలా తోచిన ప్ర‌తీసారి ఏదో క‌థ చేస్తూ గాడి త‌ప్పుతున్నాడు ఈ హీరో. అ..ఆ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌నోడు చేసిన లై అడ్డంగా ప‌డుకుంది. సినిమా ఎంత డిజాస్ట‌ర్ అంటే అమ్మిన రేట్ల‌లో క‌నీసం స‌గం కూడా రాలేదు. ఈ చిత్రంతో నితిన్ మార్కెట్ మ‌రింత‌గా డౌన్ అయింది. ఇప్పుడు ఉన్న‌ఫ‌లంగా హిట్ కొడితే కానీ నితిన్ మార్కెట్ మ‌ళ్లీ పెర‌గ‌డం క‌ష్టం. ఇప్పుడు ఇదే ప‌నిమీద ఉన్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం ఈయ‌న కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ నిర్మిస్తుండ‌టం విశేషం. దీనికి క‌థ కూడా  త్రివిక్ర‌మే ఇచ్చాడు.
ఇక దీంతోపాటు ఇప్పుడు మరో రెండు సినిమాల‌కు క‌మిట‌య్యాడు నితిన్. ఈ రెండూ దిల్ రాజు బ్యాన‌ర్ లోనే అని తెలుస్తుంది. ఒక‌టి శ్రీ‌నివాస క‌ళ్యాణం.. స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్క‌నున్న సినిమా ఇది. శ‌త‌మానం భ‌వ‌తి లాంటి సినిమా త‌ర్వాత స‌తీష్ చేస్తోన్న సినిమా ఇది. మార్చ్ నుంచి ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది. ఈ చిత్రంతో పాటు ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ దాగుడు మూత‌లులోనూ నితినే హీరోగా న‌టిస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో మ‌రో హీరోగా శ‌ర్వానంద్ న‌టించ‌నున్నాడు. ఈ రెండు సినిమాలు కానీ హిట్టైతే నితిన్ కు పోయిన అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చి మ‌రీ డోర్ కొట్టిన‌ట్లే. మొత్తానికి దారిన ప‌డ్డ కెరీర్ ను మ‌ళ్లీ గాడిన ప‌డేలా చూసుకుంటున్నాడు నితిన్. మ‌రి దీన్ని దారిన పెట్టే ద‌ర్శ‌కుడు ఎవ‌రో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here