నీదినాది ఒకేక‌థ‌ సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20180323

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: నీదినాది ఒకేక‌థ‌
న‌టీన‌టులు: శ్రీ‌విష్ణు, స‌ప్న‌టైటిస్, దేవీ ప్ర‌సాద్, రూప‌ల‌క్ష్మి, నారా రోహిత్(గెస్ట్ రోల్) త‌దిత‌రులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత‌: కృష్ణవిజ‌య్, ప్ర‌శాంతి, నారా రోహిత్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: వేణు ఉడుగుల‌
నీదినాది ఒకేక‌థ‌.. ముందు ఈ టైటిల్ ఏంటో ఎవ‌రికీ అర్థం కాలేదు. కానీ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాతే క్లారిటీ వ‌చ్చింది.. ఇది అంద‌రి క‌థ‌.. మ‌నంద‌రి క‌థ అని. మ‌రి ఇప్పుడు సినిమా విడుద‌లైంది. నిజంగానే ఈ చిత్రంలో అంత విష‌యం ఉందా..? ఈ క‌థ ఎలా ఉంది..?
క‌థ‌:
దేవీప్ర‌సాద్(దేవీప్ర‌సాద్) ఓ టీచ‌ర్. స‌మాజంలో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని మ‌ర్యాద‌తో బ‌తుకుతున్న ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రి. అత‌డి కొడుకు సాగ‌ర్(శ్రీ‌విష్ణు) డిగ్రీ కూడా పాస్ కాలేక ఇంట్లోనే తండ్రితో చివాట్లు తింటుంటాడు. ఎప్పుడూ క్రికెట్.. సినిమాలు అంటూ అల్ల‌రిగా ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు. జీవితంలో ఏం చేయాల‌నుకుంటున్నాడో.. ఏం చేస్తాడో అస్స‌లు క్లారిటీ ఉండ‌దు. దాంతో నిత్యం అత‌డి భ‌విష్య‌త్తు గురించి టెన్ష‌న్ ప‌డుతూనే ఉంటాడు తండ్రి. ఆయ‌న బాధ చూడ‌లేక తండ్రికి న‌చ్చిన‌ట్లు మారదాం అని ఫిక్స్ అయిపోయి ఏవేవో చేస్తాడు సాగ‌ర్. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కాదు. ఆ స‌మ‌యంలో సాగ‌ర్ జీవితంలోకి వ‌స్తుంది ధార్మిక (స‌ప్న‌టైటిస్). ఏళ్లు గడుస్తున్నా ఏం చేయాలో తెలియ‌క మాన‌సిక రోగిలా మారిపోతుంటాడు సాగ‌ర్. చివ‌రికి ఇత‌ను ఏం అయ్యాడు..? త‌ండ్రి మెప్పు పొందాడా లేదా అనేది అస‌లు క‌థ‌.
క‌థ‌నం:
త‌ల్లిదండ్రుల‌ను అర్థం చేసుకోలేని పిల్ల‌లు ఉంటారేమో కానీ.. పిల్ల‌ల‌ను అర్థం చేసుకోని త‌ల్లిదండ్రులు ఎక్క‌డా ఉండ‌రు. తండ్రీ కొడుకుల మ‌ధ్య జ‌రిగే ఇలాంటి మానిస‌క సంఘ‌ర్ష‌ణే నీదినాది ఒకేక‌థ‌. ఇది ప్ర‌తీ ఇంట్లో జ‌రిగే క‌థ‌లాగే ఉంటుంది. కొడుకుని మంచి పొజిష‌న్ లో చూడాల‌నుకునే ఓ తండ్రి.. చ‌దువు అబ్బ‌క.. ఏం చేయాలో తెలియ‌క‌.. తండ్రికి న‌చ్చేలా ఎలా ఉండాలో అర్థం కాక మ‌ద‌న‌ప‌డే ఓ కొడుకు.. నీదినాది ఒకేక‌థ‌లో ఇదే క‌థే ఉంటుంది. ఇక్క‌డ కొడుకు భ‌విష్య‌త్తు గురించి ఆలోచించే తండ్రిది తప్పు కాదు. తండ్రికి న‌చ్చేలా ఉండ‌లేక‌.. త‌న‌కు న‌చ్చింది చేయ‌లేక ఇబ్బందిప‌డే కొడుకుది త‌ప్పుకాదు. ప‌రువు ప్ర‌తిష్ట‌.. సంఘంలో మ‌ర్యాద అంటూ తెలియ‌ని ఓ ఫేక్ ఇమేజ్ లో.. పేరెంట్స్ త‌మ అభిప్రాయాల‌ను పిల్ల‌ల‌పై ఎలా రుద్దేస్తున్నారు.. దానివ‌ల్ల పిల్ల‌లు ఏమేం కోల్పోతున్నార‌నే విష‌యాన్ని సున్నితంగా చూపించాడు ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌.
అత‌డు తీసుకున్న కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది.. కానీ చెప్పిన విధానం ఆస‌క్తిక‌రంగా అనిపించ‌లేదు.. డాక్యుమెంట‌రీలా మారింది. నీదినాది ఒకేక‌థ‌లోని స‌న్నివేశాలు మ‌న జీవితంలోని ఏదో ఓ ఫేజ్ లో క‌చ్చితంగా క‌నెక్ట్ అవుతుంది. ఫ‌స్టాఫ్ ఎంట‌ర్ టైనింగ్ గా అనిపించినా.. సెకండాఫ్ మాత్రం నెమ్మ‌దించింది. క‌థ‌లో సీరియ‌స్ నెస్ వ‌చ్చేస‌రికి మ‌రీ వేదాంత ధోర‌ణిలోకి వెళ్లిపోయింది సినిమా. ఏ తండ్రి కూడా త‌న కొడుకు మ‌రీ అంత‌గా దిగ‌జారిపోతుంటే చూడ‌లేడు.. అలాగ‌ని కొడుకు కూడా తండ్రిని బాధ పెట్టాల‌ని అనుకోడు.. ఈ బ్యాలెన్సింగ్ సీన్స్ కాస్త బాగా రాసుంటే బాగుండేదేమో అనిపించింది. క్లైమాక్స్ మ‌రీ ఈజీగా తేల్చేసాడు ద‌ర్శ‌కుడు. ఓవ‌రాల్ గా నీదినాది ఒకేక‌థ ఓకే అనిపిస్తుంది. అవార్డుల‌కు ప‌నికి వ‌స్తుందేమో కానీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం ఈ చిత్రం అల‌రించ‌డం క‌ష్ట‌మే.
న‌టీన‌టులు:
చదువు చేత‌కాక‌.. తండ్రికి న‌చ్చిన‌ట్లు ఉండ‌లేక మ‌ద‌న‌ప‌డే పాత్ర‌లో శ్రీవిష్ణు బాగా న‌టించాడు. ఈ సినిమాలో న‌టుడిగా కూడా బాగా మెరుగు అయ్యాడు శ్రీ‌విష్ణు. తండ్రి పాత్ర‌లో ద‌ర్శ‌కుడు దేవీప్ర‌సాద్ బాగున్నాడు.. తండ్రీ కొడుకుల మ‌ధ్య సీన్స్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. హీరోయిన్ స‌ప్న‌టైటిస్ పాత్ర గురించి పెద్ద‌గా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఉన్నంత‌లో బాగా చేసింది. పోసాని ఉన్న‌ది రెండు సీన్లే అయినా బాగా న‌టించాడు. అత‌డి సీన్లు చాలా బాగున్నాయి. స‌మాజంలో జ‌రిగే వాటిపై సెటైరిక‌ల్ గా ఆ పాత్ర ఉంటుంది.
 
టెక్నిక‌ల్ టీం:
సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. ఆర్ఆర్ ప‌ర్లేదు కానీ మ‌రీ ఆఫ్ బీట్ సినిమాకు కొట్టిన‌ట్లుగా అనిపించింది. తోట రాజు ఎడిటింగ్ ఓకే. రెండు గంట‌ల సినిమానే ఉన్నా కూడా ఎందుకో కానీ సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయిన‌ట్లు అనిపించింది. సినిమాటోగ్ర‌ఫీ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. అన్నీ న్యాచుర‌ల్ లొకేష‌న్లు కాబ‌ట్టి సింపుల్ గా బాగుంది. ఇక ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల తొలి సినిమాకే చాలా స్ట్రాంగ్ కంటెంట్ తీసుకున్నాడు. స‌మాజానికి ఏదో మెసేజ్ ఇద్దామ‌ని రాసుకున్న క‌థ ఇది. కానీ అది అంత బాగా వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ ఈయ‌న చెప్పాల‌నుకున్న క‌థ మాత్రం ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతుంది. తండ్రి కొడుకు.. ఇక్క‌డ ఎవ‌రూ త‌ప్పు కాదు.. అందుకే ఎవ‌ర్నీ త‌క్కువ చేయ‌కుండా చేసే బ్యాలెన్సింగ్ లో క‌థ‌లో బ్యాలెన్స్ త‌ప్పింది. ద‌ర్శ‌కుడిగా తొలి అడుగు ఆలోచింప‌చేసే సినిమాతో వేసాడు వేణు. దానికి అత‌డు అభినంద‌నీయుడు.
చివ‌ర‌గా:
నీదినాది ఒకేక‌థ‌.. నిన్ను నువ్వు ప‌రిచ‌యం చేసుకునే క‌థ‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here