పవన్ కళ్యాణ్ తప్పు చెప్పడు అని మళ్లీ ప్రూవ్ అయింది..


పవన్ కళ్యాణ్ ఆ పేరు లోనే పవర్ ఉంది అలాంటి పవర్ ని ఎంతమంది ఎన్ని విధాలుగా చెడగొట్టడానికి చూస్తున్న వాళ్ల ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. అందుకు నిదర్శనమే ఇది.. ‘We, The Nation, The Lost Decades’ అనే పుస్తకం మీద పోస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ తప్పు చెప్పడు అని మళ్లీ ఒకసారి ప్రూవ్ అయింది. ఎలా అని అనుకుంటున్నారా…
‘We, The Nation, The Lost Decades’ అనే పుస్తకం గురించిన పోస్టులో పవన్ 1980 లలో ఆ పుస్తకం పరిచయమైందని రాస్తే ‘గుడ్రీడ్స్లో ఒరిజినల్ పబ్లిషింగ్ డేట్ 1994 లో ఉంది, దేవుడు 1980 లలోనే చదివేశాడంటూ’ కొన్ని వందలమంది అతన్నిపనిగట్టుకుని మరీ.. ఎద్దేవా చేస్తూ కామెంటు పెట్టారు.. కానీ ఒక్కసారి యండమూరి నవలల గురించి గుడ్రీడ్స్లో చూస్తే అన్ని నవలలూ 2000 తరవాతే పబ్లిష్ అయినట్టు కనిపిస్తోంది.. ఇంకాస్త ముందుకు వెళ్ళి “We The Nation’ గురించి చూస్తే కొన్నిచోట్ల 1984 లో అనీ, మరికొన్ని చోట్ల 1994 లోనూ అని ఉంది.. ఈ పుస్తకం అచ్చయింది 1984 లోనే.. ఆ తరవాత 1997 లో పదకొండో రీప్రింటు దగ్గర్నుంచీ 2016 వరకూ ముఫ్ఫై రెండు రీప్రింట్లయ్యాయి.. ఇది వ్యాసాల సంకలనం కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వొచ్చారు.. ఇది పుస్తకం లో ప్రచురించి ఉంది. ఆయన ఇది పుస్తకాలు చదివిన వారికి తెలుసుతుంది కానీ పాదయాత్రలు.. ఒక్క రోజు దీక్షలు…నమ్మే ప్రజలకి ఏమి తెలుస్తుంది.
ఒకటి మాత్రం నిజం.. పవన్ రాజకీయాల్లోకి ఓ కొత్త మార్గాన్ని వేస్తున్నాడు.. ఇంతకుముందెవరూ చేయనిది.. పిచ్చ ఇమెచ్యూర్డ్గా ఉంది కూడా.. అతను ఏ సెగ్మెంటుని టార్గెట్ చేస్తున్నాడో కూడా తెలిసిపోతోంది..
పవన్ ఎఫీషియెన్సీ గురించి అందరికి డౌట్లు ఉన్నాయి.. కానీ అతని నిజాయితీ గురించి ఈషణ్మాత్రం లేవు.. జనాలకు ఎంతవరకూ అవసరమో త్వరలోనే తేలిపోతుంది.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here