పోలీస్ కేసు పెట్టిన హీరో తల్లి

hero mother filed a case

ప్రముఖ నటుడు నాగార్జున సోదరి, హీరో సుశాంత్ తల్లి శ్రీమతి నాగ సుశీల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదు చేసారు. వివరాల ప్రకారం తన స్థలాన్ని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమతి లేకుండా విక్రయించాడని పోలీసులకు ఫిర్యాదు చేసారు నాగ సుశీల. శ్రీనివాస్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, మోసం చేసాడని చీటింగ్ కేసు దాఖలు చేసారు. అతడికి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. పరారీ లో ఉన్న శ్రీనివాస్ ను పోలీసులు గాలిస్తున్నారు, కేసు దర్యాప్తు జరుగుతుంది.