ప్రివ్యూ: ఆర్ఎక్స్ 100


కొత్త వాళ్ల‌కు ఇప్పుడు గోల్డెన్ టైమ్ న‌డుస్తుంది. మంచి క‌థ‌తో అన్నా రావాలి.. లేదంటే బోల్డ్ క‌థ‌తో అయినా రావాలి. చాలా మంది ఇందులో బోల్డ్ కంటెంట్ ను ఆస‌ర‌గా చేసుకుని వ‌స్తున్నారు. సినిమాలో ముద్దుల‌కు ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 కూడా ఇలా వ‌స్తున్న సినిమానే. ఇందులో హీరో హీరోయిన్ తో పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. ఇద్ద‌రూ కొత్త‌వాళ్లే..
ద‌ర్శ‌కుడు కూడా కొత్త‌వాడే. కానీ సినిమాపై విడుద‌ల కు ముందు ఆస‌క్తి ఉందంటే దానికి కార‌ణం ట్రైల‌ర్ లో రొమాన్స్.. లిప్ లాక్ సీన్స్ లో జీవించేసారు హీరో కార్తికేయ‌, హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్. ఈ ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ తోనే ఏంట్రా ట్రైల‌ర్ లోనే ఇంత ఉంటే సినిమాలో ఇంకెంత ఉంటుంద‌నే టాక్ బ‌య‌టికి వెళ్లిపోయింది.
అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన ఈ చిత్రం జులై 12న విడుద‌ల కానుంది. ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా 92 స్క్రీన్స్ లో విడుద‌ల కానుండ‌టం విశేషం. అర్జున్ రెడ్డి త‌ర‌హాలోనే మా సినిమా న‌చ్చ‌క‌పోతే రావద్దంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు హీరో కార్తికేయ‌. ఇది ఓవ‌ర్ కాన్పిడెన్సా.. ఓన్లీ కాన్ఫిడెన్సా అనేది మాత్రం ఇప్పుడు కాదు విడుద‌ల త‌ర్వాత తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here