ప్ర‌పంచం మ‌నుషుల సొత్తు కాదు..

2point0
అబ్బ సొత్తు కాదురా టాలెంట్.. ఎవ‌డ‌బ్బ సొత్తు కాదురా టాలెంట్ అంటూ అప్ప‌ట్లో వ‌ర్మ పాడిన పాట గుర్తుంది క‌దా..! ఇప్పుడు శంక‌ర్ కూడా ఇదే అంటున్నాడు. మ‌నుషుల సొత్తు కాదురా ఈ ప్ర‌పంచం అంటున్నాడు. ఇందులో ఇంకా చాలా మందికి భాగం ఉంది.. అందులో రోబోలు కూడా భాగం అంటున్నాడు. ఇదే విష‌యాన్ని పోస్ట‌ర్స్ రూపంలోనూ చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు విడుద‌లైన 2.0 పోస్ట‌ర్స్ సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచే స్తున్నాయి.
ది వ‌ర‌ల్డ్ ఈజ్ నాట్ ఫ‌ర్ ఓన్లీ హ్యూమ‌న్స్ అంటూ చెప్పాడు. అంటే ఈ ప్ర‌పంచం మ‌నుషుల‌కు మాత్ర‌మే కాదు అని అర్థం. దీన్నిబ‌ట్టే క‌థ ఏంటో అర్థ‌మైపోతుంది. 450 కోట్ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ రిలీజ్ డేట్ కూడా శంక‌రే అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసాడు. మొద‌ట్లో ఏమో కానీ ఇప్పుడు మాత్రం 2.0 రేట్స్ చూసి భ‌య‌ప‌డుతున్నారు బ‌య్య‌ర్లు. ఇంత మొత్తం తిరిగి వ‌స్తుందా రాదా అని వ‌ణికిపోతున్నారు వాళ్లు. మ‌రి వాళ్ళ న‌మ్మ‌కాన్ని 2.0 ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here