బాపుబొమ్మ బాలీవుడ్ లో తేలిందేంటి..?


ఒక్కోసారి అంతే.. వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ స‌డ‌న్ గా మాయ‌మైపోతుంటారు. ఆ మ‌ధ్య తెలుగుతో పాటు క‌న్న‌డ ఇండ‌స్ట్రీని కూడా ఊపేసిన ప్ర‌ణీత‌.. ఉన్న‌ట్లుండి మాయ‌మైపోయింది. ఏమైందో.. ఎక్క‌డుందో తెలియ‌దు. ఏడాదిగా ప్ర‌ణీత గురించి పెద్ద‌గా ఏం తెలియ‌దు. అప్ప‌ట్లో ఓ యాక్సిడెంట్ నుంచి బ‌య‌ట‌ప‌డిన బాపుబొమ్మ‌.. త‌ర్వాత సినిమాల‌కు కూడా దూర‌మైంది. ఆఫ‌ర్లు రావ‌డం లేదో లేదంటే తానే కావాల‌ని దూరంగా ఉంటుందో తెలియ‌దు కానీ ఇప్పుడు ప్ర‌ణీత పేరే మ‌రిచిపోయారు తెలుగు ఆడియ‌న్స్.
అత్తారింటికి దారేదిలో బాపు బొమ్మ‌గా అంద‌రికీ బాగా ద‌గ్గ‌రైన బ్యూటీ ప్ర‌ణీత‌. దానికి ముందే కొన్ని సినిమాలు చేసినా ఆమెను ప‌ట్టించుకోలేదు ప్రేక్ష‌కులు.. ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ప‌వ‌న్ తో న‌టించిన త‌ర్వాత ర‌భ‌స లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. కొన్నాళ్లుగా అవి కూడా రావ‌ట్లేదు. దాంతో అంద‌రి ముద్దుగుమ్మ‌ల మాదిరే అందాల ఆర‌బోత‌కు తెర‌తీసింది.
చిన్న‌చిన్న డ్ర‌స్సుల్లో మ‌తులు పోగొట్టే ప్రోగ్రామ్ పెట్టేసింది ప్ర‌ణీత‌. చాలా రోజుల త‌ర్వాత తెలుగులో రామ్ హ‌లో గురూ ప్రేమ‌కోస‌మేలో న‌టిస్తుంది. ఈ చిత్రంతో పాటు క‌న్న‌డ‌లో రెండు సినిమాలు చేస్తుంది. ఇవ‌న్నీ ఇలా ఉంటే బాలీవుడ్ లో ఇప్పుడు ఓ ప్రైవేట్ వీడియో ఒక‌టి చేసింది ప్ర‌ణీత‌.
ఆయుష్మాన్ ఖురానాతో క‌లిసి రొమాన్స్ చేసింది ఈ పాట‌లో. పేరుకు ప్రైవేట్ వీడియో అయినా దాన్ని నిర్మించింది టి సిరీస్. దాంతో బాలీవుడ్ చూపులు బాపుబొమ్మ‌పై ప‌డ్డాయి. ఈ పాట‌కు రెండు రోజుల్లోనే 80 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఈ పాటే త‌న కెరీర్ ను మార్చేస్తుంద‌నే ఆశ‌తో ఉంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈమె ఆశ‌లు ఎంత‌వ‌ర‌కు నెర‌వేర‌తాయో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here