
తెలుగమ్మాయిలు రెచ్చిపోరు.. అందాల ఆరబోతలో వెనకబడ్డారు అని ఎవరో అన్నారు ఇండస్ట్రీలో. ఆ అన్న వాళ్లెవరో కానీ ఒక్కసారి ముందకొస్తే బాగున్ను. ఎందుకంటే తలుచుకుంటే హాలీవుడ్ హీరోయిన్లు కూడా తమను చూసి సిగ్గుపడాల్సిందే అన్న రేంజ్ లో తెలుగమ్మాయిలు కూడా హై రేంజ్ గ్లామర్ షో చేస్తున్నారిప్పుడు. కావాలంటే అదితిరావ్ హైద్రీని చూపించండి. ఈ భామ అచ్చతెలుగమ్మాయి. ఈ విషయం చాలా మందికి తెలి యకపోవచ్చు. హైద్రాబాద్ నుంచే బాంబే వెళ్లింది అదితి. ఇంకా మాట్లాడితే వనపర్తి సంస్థానానికి వారసురాలు ఈ ముద్దుగుమ్మ. ఈమె తాతయ్య అప్పట్లో గవర్నర్ కూడా. చరిత్ర మారేకొద్ది అమ్మాయిగారి అడ్రస్ కూడా హైద్రాబాద్ టూ ముంబై అయిపోయింది. ఇక్కడ అవకాశాల్లేక.. మోడలింగ్ చేసుకుంటూ బాలీవుడ్ వెళ్లింది ఈ బ్యూటీ. అక్కడ కొన్ని సినిమాలు చేసింది అదితి. కానీ క్రేజ్ రాలేదు.
మణిరత్నం చెలియా సినిమాలో నటించినా అది ఫ్లాపే. దాంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అందుకే సినిమాల వైపు చూడటం మానేసి.. హాట్ ఫోటోషూట్లతో కాలం గడిపేస్తుంది. బికినీ షోలతో మతులు పోగొడుతుంది ఈ తెలుగమ్మాయి. తాజాగా విడుదలైన బికినీ షో చూసి కుర్రాళ్ల గుండెలైతే గుబేల్ అంటున్నాయి. అసలే అతిథిలా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అదితి.. ఇలా అందాలు ఆరబోస్తుంటే చూసి తట్టుకోవడం మాత్రం ఎవరి వల్లా కాదేమో..? అన్నట్లు ఇప్పుడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అదితిరావ్ హైద్రీ.