మీసం గా రానునున్న కన్నడ హోమ్ మినిస్టర్!

Upendra 2 Movie Images

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘ఏ’, ‘ఉపేంద్ర’, ‘రా’ వంటి చిత్రాలతో ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ నిర్మించిన ‘s /o సత్య మూర్తి’ లో తళుక్కుమన్నాడు ఉపేంద్ర. తాజాగా అయన నటించిన కన్నడ చిత్రం ‘హోమ్ మినిస్టర్’. తకిట తకిట, సత్యభామ వంటి చిత్రాలు తీసిన శ్రీహరి నాను ఈ చిత్రానికి దర్శకుడు. హోమ్ మినిస్టర్ తెలుగు లో దుబ్బింగ్ చేయబడుతుంది. తెలుగు వెర్షన్ టైటిల్ ను ‘మీసం’ గా ఖరారు చేసారు.

రాజకీయ నేపథ్యం తో తీయబడిన ఈ చిత్రంలో ఉపేంద్ర హోమ్ మినిస్టర్ గా కనిపించబోతున్నాడు. నిజ జీవితం లో కూడా అయన రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు తాజా సమాచారం. అక్టోబర్ 9 న తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నారట. పార్టీ పేరు ‘ఉప్పి’ అని విశ్వసనీయ వర్గాల వార్త. ఉప్పి అంటే ‘ఉత్తమ ప్రజా పార్టీ అఫ్ ఇండియా’ అట. సో, హోమ్ మినిస్టర్ గా తెర మీద కనబడ్డ ఉపేంద్ర మరి నిజ జీవితంలో హోమ్ మినిస్టరే అవుతారో ఏకంగా ముఖ్య మంత్రి అవుతారో చూడాలి