మే చివరి వారంలో మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు'


మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ కీలక పాత్ర పోషించారు.
ఇటీవల తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ ”అభిమన్యుడు’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. తమిళ్‌లో ఇటీవల విడుదలైన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. రివ్యూస్‌ కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. ‘రంగస్థలం’, ‘మహానటి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ సమంతకు ‘ఇరుంబుతెరై’ హ్యాట్రిక్‌ చిత్రంగా నిలిచింది. తమిళ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా చాలా పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు.
మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here