మోక్షజ్ఞ కోసం పోటీలో ముగ్గురు దర్శకులు…

మోక్షజ్ఞ తెరంగేట్రం 2018 లో జరుగుతుందని బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి వారసుడను పరిచయం చేయబోయే దర్శకుడు ఎవరు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. బాలయ్య మాస్ ఇమేజ్ ప్రకారం మోక్షజ్ఞ మొదటి చిత్రంకూడా పక్క మాస్ చిత్రం కావచ్చు అని ఫ్యాన్స్ అనుకున్నారు. బోయపాటి శ్రీను లేదా వి వి వినాయక్ వంటి మాస్ దర్శకులను ఎంపిక చేయవచ్చని అందరు అనుకున్నారు. ఒకానొక దశ లో పూరి జగన్నాధ్ అయ్యి ఉండవచ్చని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఇటీవలే పైసా వసూల్ చిత్రంలో బాలయ్యను కొత్త కోణం లో చూపించడంలో పూరి సక్సెస్ అయ్యాడు.

అయితే ఇషాన్ అనే కుర్రాడిని పరిచయం చేస్తూ రోగ్ అనే చిత్రాన్ని తీయడం, ఇప్పుడేమో తనయుడు ఆకాష్ తో ‘మెహబూబా’ అనే చిత్రం తీయనుండటం తో పూరి ని పక్కన పెట్టినట్లు సమాచారం. తాజాగా బాలకృష్ణ రాజమౌళి, క్రిష్ వంటి నేషనల్ లెవెల్ లో క్రేజ్ ఉన్న దర్శకుల తో మోక్షజ్ఞ పరిచయం జరిగితే భారీ స్థాయిలో ఇతర భాషల్లో కూడా చిత్రాన్ని విడుదల చేయొచ్చని తలుస్తున్నట్లు వినికిడి. మరో వైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే బాగుంటుందని ఫిలిం నగర్ వర్గాల గుస గుస. మరి బాలయ్య తనయుని సినీ రంగ ప్రవేశానికి ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. ‘వారాహి చలన చిత్రం’ సాయి కొర్రపాటి సంయుక్తంగా బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.