మోహన్ బాబు ‘గాయత్రీ’ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న విష్ణు మంచు, శ్రియ

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రీ’ అనే చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లోగోకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. విష్ణు నేటి నుండి షూటింగ్ ప్రారంభించారు. శ్రియ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిత్ర బృందం మోహన్ బాబు, విష్ణు, మరియు శ్రియలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన ‘శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్’ పై నిర్మిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ‘జై సింహ’ షూటింగ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ‘గాయత్రీ’ సెట్స్ కు వచ్చి మోహన్ బాబు గారిని, విష్ణును కలిసి, వారితో కొంత సేపు ముచ్చటించారు.

అనసూయ మరియు ‘మేడ మీద అబ్బాయి ఫేమ్’ నిఖిల విమల్ కూడా గాయత్రీ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here