రాజు గారి గది 2 రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
2017-10-13

Critic Reviews for The Boxtrolls

తారాగణం: నాగార్జున, సమంత, సీరత్ కపూర్, వెన్నెల కిశోరె, అశ్విన్ బాబు, ప్రవీణ్, షకలక శంకర్

దర్శకత్వం: ఓంకార్

సంగీతం: ఎస్ ఎస్ తమన్

నిర్మాత: ప్రసాద్ వి పొట్లూరి

బ్యానర్: పి వి పి సినిమాస్, మాటినీ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఓక్ ఎంటర్టైన్మెంట్స్

కథ:

అశ్విన్, కిశోరె (వెన్నెల) మరియు రవి (ప్రవీణ్), ముగ్గురు స్నేహితులు కలిసి ఓ బీచ్ రిసార్ట్ ను ప్రారంభిస్తారు. సుహానిస (సీరత్) తన ఫ్రెండ్స్ తో రిసార్ట్ కి వస్తుంది. ఆమె అందానికి మైమరచిపోయి ముగ్గురు స్నేహితులు ఆమెతో డేటింగ్ చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారికీ కొన్ని చిత్రమైన సంఘటనలు జరుగుతాయి. రిసార్ట్ లో దెయ్యం ఉందని గ్రహిస్తారు. భయపడి రుద్ర అనే మెంటలిస్ట్ ను సంప్రదిస్తారు. పోలీసులకు కూడా కేసులు ఛేదించడానికి మానసిక శాస్త్రజ్ఞుడు అయిన రుద్రా సహాయం కోరుతుంటారు. రుద్రా రిసార్ట్ సంచరిస్తున్నది అమృత అనే అమ్మాయి ఆత్మ అని గుర్తిస్తాడు. ఆమె గతమెంతో తెలుసుకుంటాడు. అమృత లా చదివే ఓ విద్యార్థిని. అనుకోని విచారకరమైన సంఘటన వల్ల ఆమె ఆత్మ హత్య చేసుకుంటుంది. అమృతకు ఎం జరిగింది? ఆమె కు రిసార్ట్ కు సంబంధమేమిటి? అమృత కు జరిగినదానికి భాద్యులెవరు? ఈ మిస్టరీ ని రుద్రా ఎలా ఛేదిస్తాడో వెండి తెరపై చూడాలిసిందే.

స్క్రీన్ప్లే:

రాజు గారి గది 2 మొదటి భాగం లాగే హారర్ కామెడీ గా మన ముందుకు వచ్చింది. అయితే రెండవ భాగంలో కామెడీ తో పటు భారీ ఎమోషన్ సీన్ లు సెంటిమెంట్ దండి గా ఉంటుంది. మలయాళం చిత్రం ప్రీతమ్ ఆధారంగా తీసినా, రాజు గారి గది 2 లో వినోదం తో నింపాడు దర్శకుడు ఓంకార్. ప్రథమార్ధం మొత్తం వెన్నెల కిషోర్, ప్రవీణ్ ల కామెడీ తో సరదాగా సాగిపోతుంది. సీరత్ కపూర్ గ్లామర్ తో కాను విందు చేస్తుంది. నాగార్జున ఎంట్రీ తో చిత్రం సీరియస్ గా మారుతుంది. సమంత తో నాగార్జున తలపడే ఇంటర్వెల్మ బ్యాంగ్ బాగుంటుంది. ద్వితీయార్ధం లో అమృత ఎమోషనల్ గా బరువెక్కుతుంది. అమృత తండ్రి రావు రమేష్ మధ్య వచ్చే సెంటిమెంటల్ సీన్స్ కంట తడిపెట్టిస్తాయి. రుద్రా అనుమానితులను ఇంటెలిజెంట్ గా ఇంటర్రోగేట్ చేసే సన్నివేశాలు కట్టిపడేస్తాయి. . మామూలుగా హారర్ చిత్రాల్లో వచ్చే గ్రాఫిక్ హడావిడి లేకుండా క్లైమాక్స్ సింపుల్ గా ఉన్నట్లనిపిస్తుంది.

తారాబలం:

రుద్ర గా నాగార్జున ఓ పక్క స్టయిలుగా ఉంటూనే మరో పక్క మానసిక శాస్త్రజ్ఞుడిగా అద్భుత నటన కనబరిచాడు. ఎప్పుడు చలాకి పాత్ర ల్లో కనిపించే సమంత తన ఎమోషనల్ నటనతో ఆశ్చర్య పరుస్తుంది. వెన్నెల కిశోరె, ప్రవీణ్ కితకితలు పెడతారు. అశ్విన్ బాబు పర్వాలేదనిపిస్తుంది. షకలక శంకర్, విద్యు రామం లకు పెద్దగా స్కీన్లు లేవు. సీరత్ కపూర్ పొట్టి దుస్తుల్లో గుబులు రేపుతాది.

సాంకేతికత:

పి వి పి వారు అత్యున్నత సాంకేతిక విలువలతో చిత్రాన్ని నిర్మించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం చిత్రానికి పెద్ద హైలైట్. చాల సన్నివేశాలు తమన్ తన మ్యూజిక్ తో మరో లెవెల్ కు లేపాడని చెప్పాలి. ఛాయాగ్రహం అద్భుతం గా ఉంటుంది. హారర్ థ్రిల్లర్ ఫీల్ ను బాగా ఎలేవేటే చేయడం లో మ్యూజిక్, కెమెరా వర్క్ బాగా హెల్ప్ అయ్యాయి. అబ్బూరి రవి డైలాగులు గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాలి. కామెడీ తో పాటు మనసుకు హత్తుకొనే డైలాగ్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి “అమ్మాయి అనే మాట లో కూడా అమ్మ అనే పిలుపుంటుంది.” ఎమోషనల్ కథ ని వినోదాత్మకం గా తెరకెక్కించడం లో ఓంకార్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి.

చివరి మాట:

రాజు గారి గది 2 బలమైన ఎమోషనల్ కంటెంట్ ఉన్న హారర్ కామెడీ చిత్రం . ప్రస్తుత సమాజం లో స్త్రీ ల పై జరుగుతున్న అఘాయిత్యాల దృష్ట్యా ఓ పవర్ఫుల్ మెసేజ్ కూడా ఈ చిత్రంలో ఉంది.