రాజ‌కీయాల్లోకి శింబు.. రాణిస్తాడా..?


ఇప్ప‌టికే త‌మిళ‌నాట స్టార్ హీరోలంతా రాజ‌కీయాల‌పై క‌న్నేసారు. ర‌జినీకాంత్ కొత్త పార్టీ ప‌నుల‌తో బిజీగా ఉంటే.. క‌మ‌ల్ హాస‌న్ అయితే ఏకంగా పార్టీని కూడా పెట్టేసాడు. ఇక విజ‌య్ ఎప్పుడెప్పుడు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇద్దామా అని టైమ్ కోసం చూస్తున్నాడు. అజిత్ కు అవేవీ ప‌ట్ట‌న‌ట్లే ఉన్నా ఎప్పుడు మ‌న‌సు మార్చుకుంటాడో తెలియ‌దు. విశాల్ ఇప్ప‌టికే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి కూడా వ‌చ్చేసాడు. ఇలా ఎవ‌రికి వాళ్లు పాలిటిక్స్ తో బిజీగానే ఉన్నారు.
ఇలాంటి టైమ్ లో ఇప్పుడు శింబు కూడా త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ఖ‌రారు చేసాడు. ఈయ‌న కూడా ఇప్పుడు కొత్త పార్టీతో వ‌స్తున్నాడు. మానాడు అంటూ త‌న పార్టీ పేరు కూడా అనౌన్స్ చేసాడు. అయితే ఇదంతా సినిమా కోస‌మే కానీ రియ‌ల్ గా మాత్రం కాదు. ఈయ‌న ప్ర‌స్తుతం సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు..
రాజ‌కీయాల‌పై త‌న‌కు దృష్టి పెట్టే టైమ్ లేదంటున్నాడు. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న ప్ర‌స్తుతం మానాడు సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో న‌డ‌వ‌బోతుంది. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితులే ఈ చిత్ర క‌థ‌కు కార‌ణం అంటున్నాడు ఈ హీరో. మ‌రి ఈ రాజ‌కీయాల‌తో శింబు ఎలాంటి మాయ చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here