రివ్యూ: ఈ న‌గ‌రానికి ఏమైంది

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20180629

Critic Reviews for The Boxtrolls

రివ్యూ          : ఈ న‌గ‌రానికి ఏమైంది
న‌టీన‌టులు    : విశ్వక్ సేన్, సుశాంత్, అభిన‌వ్, వెంక‌టేశ్ కాకురాల, అనీషా ఆంబ్రోస్ త‌దిత‌రులు
నిర్మాత‌        : ద‌గ్గుపాటి సురేష్ బాబు
సినిమాటోగ్ర‌ఫీ  : నికేత్ బొమ్మి
సంగీతం       : వివేక్ సాగ‌ర్
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ద‌ర్శ‌కుడు: త‌రుణ్ భాస్క‌ర్

పెళ్లిచూపులుతో ఇండ‌స్ట్రీని ఊపేసిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఈ చిత్రం వ‌చ్చిన రెండేళ్ళ త‌ర్వాత రెండో సినిమాతో వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ పూర్తిగా యూత్ ఫుల్ కామెడీతో వ‌చ్చేసాడు. మ‌రి నిజంగానే మ‌రోసారి ఈ ద‌ర్శ‌కుడు మాయ చేసాడా..? అస‌లు ఈ న‌గ‌రంలో ఏమైంది..?

క‌థ‌:
కార్తిక్(సుశాంత్).. వివేక్ (విశ్వ‌క్ సేన్).. ఉప్పు(వెంక‌టేశ్).. కౌశిక్(అభిన‌వ్) ఫ్రెండ్స్. అంద‌రికీ లైఫ్ లో ఒక‌టే కోరిక‌. షార్ట్ ఫిల్మ్స్ చేసి పేరు గుర్తింపు తెచ్చుకోవాల‌ని. అయితే లైఫ్ లో జ‌రిగిన చిన్న చిన్న సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఎవ‌రికి వాళ్లు విడిపోయి త‌మ లైఫ్ లో బిజీ అయిపోతారు. అలాంటి టైమ్ లో మ‌ళ్లీ కార్తిక్ కు పెళ్లి కుదిరింద‌ని అంతా క‌లిసి పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీలోనే త‌ను మ‌రిచిపోలేని బ్రేక‌ప్ స్టోరీ గుర్తు చేసుకుంటాడు వివేక్. అదే మ‌త్తులో ఫుల్లుగా తాగి గోవా వెళ్లిపోతారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
ఈ న‌గ‌రానికి ఏమైంది.. ఓ వైపు కామెడీ.. మ‌రోవైపు కూడా కామెడీనే..! క‌డుపులు చెక్క‌ల‌య్యేలా న‌వ్వాలంటే.. చెల్లించ‌క త‌ప్ప‌దు టికెట్ మూల్యం. కామెడీ లేని సినిమాలు చూస్తుంటాం కానీ.. క‌థ లేని సినిమాలు చూస్తామా..? చూడాలంటే ఈ న‌గ‌రానికి ఏమైంది చూడాల్సిందే.. ఇందులో క‌థ లేదు.. కామెడీ త‌ప్ప‌. న‌లుగురు ఫ్రెండ్స్ క‌లిసి చేసే క్రేజీ ప‌నులే ఈ సినిమా క‌థ‌. ప్ర‌తీ సీన్ లోనూ ఫ‌న్ వ‌చ్చేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. పెళ్లిచూపులుతో యూత్ ప్ల‌స్ ఫ్యామిలీస్ ను ఆక‌ట్టుకున్న త‌రుణ్ భాస్క‌ర్..

రెండో సినిమాకు వ‌చ్చేస‌రికి పూర్తిగా యూత్ నే టార్గెట్ చేసాడు. అవ‌స‌రానికి మారిపోయే పాత్ర‌లు త‌ప్ప‌.. హీరోలు విల‌న్లు లేరీ నాట‌కంలో అన్న‌ట్లు.. ఈ న‌గ‌రానికి ఏమైందిలో కూడా ఒక్కో సీన్ లో ఒక్కొక్క‌రు హీరో. ముఖ్యంగా మ‌రోసారి డైలాగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు త‌రుణ్. స్టీరియోటైప్ సినిమాటిక్ డైలాగ్స్ మాదిరి కాకుండా.. మ‌నం రోజూ మాట్లాడుకునేలా ఉన్నాయి. క‌థ పెద్ద‌గా లేక‌పోయినా.. సిచ్యువేష‌న‌ల్ కామెడీతోనే క‌డుపులు చెక్క‌లయ్యేలా న‌వ్వించాడు త‌రుణ్ భాస్క‌ర్. ముఖ్యంగా ప్రీ ఇంట‌ర్వెల్ సీన్.. సెకండాఫ్ లో వ‌చ్చే ఓ షార్ట్ ఫిల్మ్ సీన్ లో కామెడీ పీక్స్ అంతే. క‌థ కావాలి.. ఎమోష‌న్స్ కావాలి.. సెంటిమెంట్ కావాలంటే ఈ న‌గ‌రం మీకు న‌చ్చ‌దు. మాకు ఏం వ‌ద్దు..

కామెడీ ఉంటే చాలు.. కాసేపు న‌వ్వుకుని వ‌స్తే హాయి అనుకున్న వాళ్ల‌కు మాత్రం ఫుల్ ఫ‌న్ రైడ్ ఈ న‌గ‌రానికి ఏమైంది. గోవా వెళ్లిన త‌ర్వాత పిచ్చి పీక్స్ కు వెళ్లిపోతుంది. అక్క‌డ షార్ట్ ఫిల్మ్ తీసే క్ర‌మంలో కాస్త స్లో అవుతుంది కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ పైకి లేపాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా విశ్వ‌క్ సేన్ సైకో యాక్ష‌న్ మాత్రం అదిరిపోయింది. అత‌డికి, అభిన‌వ్ కు మ‌ధ్య వ‌చ్చే సీన్స్ హిలేరియ‌స్ గా పేలాయి. క్లైమాక్స్ వ‌ర‌కు కూడా పెద్దగా ట్విస్టులు ఏం లేకుండానే క‌థ ముందుకెళ్తుంది. పెళ్లిచూపులు రేంజ్ లో ఊహించుకుని వెళ్తే క‌ష్ట‌మే కానీ న‌వ్వుకోడానికి మాత్రం ఈ న‌గ‌రానికి ఏమైంది ప‌ర్ ఫెక్ట్ ఛాయిస్.

న‌టీన‌టులు:
ఇందులో న‌లుగురు హీరోలున్నారు. న‌లుగురు బాగా చేసారు. ముఖ్యంగా విశ్వ‌క్ అద్బుతంగా న‌టించాడు. ఈయ‌న కారెక్ట‌ర్ కు ఎక్కువ‌గా పేస్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. సైకోయిక్ గా ఉండే ఈ పాత్ర‌తో సూప‌ర్ ఫ‌న్ పండించాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్. ఇక కార్తిక్ గా సుశాంత్ రెడ్డి బాగున్నాడు. హై క్లాస్ లుక్స్ తో పిచ్చెక్కించాడు. అభిన‌వ్ పాత్ర పెళ్లిచూపులులో ప్రియ‌ద‌ర్శిని గుర్తు చేస్తుంది. త‌న‌కు ఉన్నంత మేర‌లో బాగానే న‌వ్వించాడు ఈ క‌మెడియ‌న్. ముఖ్యంగా వివేక్ పాత్ర‌తో వ‌చ్చే సీక్వెన్స్ బాగా పేలింది. వెంక‌టేశ్ కాకురాల బాగా చేసాడు. అనీషా ఆంబ్రోస్ తో పాటు సిమ్ర‌న్ చౌద‌రి త‌మ పాత్ర‌ల మేర‌కు ప‌ర్లేద‌నిపించారు.

టెక్నిక‌ల్ టీం:
పెళ్లిచూపులుకు కూల్ మ్యూజిక్ ఇచ్చిన వివేక్ సాగ‌ర్.. ఈ సారి కాస్త డోస్ పెంచేసాడు. పాట‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేక‌పోయినా బ్యాంగ్రౌండ్ స్కోర్ బాగుంది. కొత్త‌గా ఉంది విన‌డానికి. ఇక ఆగి ఆగి పాట బాగుంది. నికేత్ బొమ్మ సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. గోవా అందాల‌ను బాగానే చూపించాడు. ఎడిటింగ్ కాస్త వీక్. సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయిన ఫీలింగ్ వ‌స్తుంది. ద‌ర్శ‌కుడిగా త‌రుణ్ భాస్క‌ర్ మ‌రోసారి స‌క్సెస్ అయ్యాడు. అంతా కొత్త‌వాళ్ల‌తో ఇలాంటి స‌బ్జెక్ట్ చేయ‌డం సాహ‌స‌మే. కానీ చేసాడు త‌రుణ్. కామెడీతో ప‌ర్లేదు కానీ క‌థ కావాలంటే మాత్రం ఈ న‌గ‌రానికి ఏమైంది మైన‌స్ గానే మిగిలిపోయింది.

చివ‌ర‌గా:
ఈ న‌గ‌రానికి ఏమైంది.. క్రేజీ ఫ‌న్ రైడ్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here