రివ్యూ: విజేత‌

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

న‌టీన‌టులు      : క‌ళ్యాణ్ దేవ్, మాళ‌విక న‌య్య‌ర్, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాశ్, త‌ణికెళ్ల భ‌ర‌ణి..
సంగీతం          : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్
నిర్మాత‌          : ర‌జినీ కొర్ర‌పాటి
సినిమాటోగ్ర‌ఫ‌ర్  : కేకే సెంథిల్ కుమార్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: రాకేష్ శ‌శి
33 ఏళ్ల కింద వ‌చ్చిన చిరంజీవి క్లాసిక్ విజేత‌. ఇప్పుడు ఇదే టైటిల్ ను త‌న సినిమా కోసం వాడుకున్నాడు చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్. తొలి సినిమాతోనే కుటుంబ ప్రేక్ష‌కుల‌ను టార్గెట్ చేసాడు. మ‌రి అల్లుడు అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రించాడా..?
క‌థ‌:
రామ్(క‌ళ్యాణ్ దేవ్) బిటెక్ చేసి అల్ల‌రి చిల్ల‌రిగా తిరుగుతుంటాడు. ఎలాంటి బాధ్య‌త‌లు లేకుండా ఉంటాడు. తండ్రి శ్రీ‌నివాస‌రావు(ముర‌ళి శ‌ర్మ‌) క‌ష్ట‌ప‌డుతున్నా కూడా చూస్తుంటాడు కానీ క‌ష్ట‌ప‌డ‌డు. జాబ్ చేయ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌డు. ఇలా ఆవారాగా తిరుగుతున్న స‌మ‌యంలోనే రామ్ జీవితంలోకి చైత్ర (మాళ‌విక న‌య్య‌ర్) వ‌స్తుంది. అలా సాగిపోతున్న రామ్ కు తండ్రి గుండెపోటుతో షాక్ త‌గులుతుంది. ఒక్క‌సారిగా అత‌డి జీవితం అక్క‌డే ఆగిపోతుంది. అక్క‌డ్నుంచి తండ్రి కోసం ఏదైనా చేయాల‌నే త‌ప‌న‌తో క‌ష్ట‌ప‌డ‌తాడు రామ్. మ‌రి ఇంత‌కీ తండ్రి కోసం ఈ త‌న‌యుడు ఏం చేసాడు.. చివ‌రికి విజేత ఎలా అయ్యాడు అనేది క‌థ‌..!
క‌థ‌నం:
తండ్రి కొడుకు.. ఎప్పుడూ బోర్ కొట్టని ఎమోషన్. చెప్పే తీరులో చెబితే..ఎన్నిసార్లైనా చూసే కథ. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి పడే ఆవేదన.. తండ్రి లక్ష్యం కోసం తనయుడు చూపే తెగువ ఈ విజేత. తెలిసిన కథనే ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేసాడు రాకేష్ శశి. ఫస్ట్ హాఫ్ లో కథలోకి తీసుకెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నా.. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ జర్నీతో నడిపించాడు దర్శకుడు రాకేష్.
రొటీన్ కథ కావడం ఒక్కటే ఈ విజేతకు ప్రతికూలం. హీరోకి ఇంట్రో కావాలి.. ఫైట్ కావాలి.. అనవసరపు హంగామా కావాలి అని కాకుండా కథకు అనుకూలంగా వెళ్ళాడు దర్శకుడు. తొలి సినిమాకు రొటీన్ కథ అయినా.. మంచి కథ ఎంచుకున్నాడు కళ్యాణ్ దేవ్. హీరో కంటే ఎక్కువగా కథనంపై దృష్టి పెట్టాడు దర్శకుడు..
విజేతకి మురళి శర్మ ప్రాణం.. ముందుండి నడిపించాడు. ఓవరాల్ గా ఈ విజేత.. ఎమోషనల్ జర్నీ. అయితే చేసుకునే ప్రమోషన్ ని బట్టి ఈ సినిమా రేంజ్ ఆధారపడి ఉంది. ముఖ్యంగా తండ్రి క‌ల నెర‌వేర్చే క్ర‌మంలో హీరో చేసే పనుల‌న్నీ ఎమోష‌న‌ల్ గా బాగా క‌నెక్ట్ అవుతాయి. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం. ముర‌ళి శ‌ర్మ ఈ క‌థ‌కు ప్రాణం పోసాడు.
న‌టీన‌టులు:
క‌ళ్యాణ్ దేవ్ తొలి సినిమా కావ‌డంతో న‌ట‌న గురించి పెద్ద‌గా మాట్లాడుకోవాల్సిన ప‌నిలేదు. ఇంకా చాలా మెరుగుప‌డాలి. కాక‌పోతే నేల‌మీద ఉండే క‌థ‌ను తొలి సినిమా కోసం ఎంచుకోవ‌డం మెచ్చుకోద‌గ్గ అంశం. ఇలాగే క‌థ‌కు ప్రాధాన్యం ఇస్తే ప్రేక్ష‌కుల‌కు చేరువ కావ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. ఇక హీరోయిన్ మాళ‌విక న‌య్య‌ర్ ప‌క్కింటి అమ్మాయిలా ఒదిగిపోయింది. తండ్రి పాత్ర‌లో ముర‌ళి శ‌ర్మ ప్రాణం పెట్టాడు. ఆయ‌నే సినిమాకు హీరో. సెకండాఫ్ అయితే పూర్తిగా ఆయ‌న‌పైనే న‌డిచింది. ముర‌ళిశ‌ర్మ స్నేహితుడిగా త‌ణికెళ్ళ భ‌ర‌ణి బాగా చేసాడు. మిగిలిన వాళ్ళంతా ఓకే..
టెక్నిక‌ల్ టీం:
విజేత ఔట్ పుట్ బాగా వ‌చ్చిందంటే దానికి కార‌ణం మ్యూజిక్. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వర్ ఎలా ఉంటాడో చాలా మందికి తెలియ‌దు కానీ ఆయ‌న సంగీతం మాత్రం ఇప్పుడు అంద‌రికీ తెలిసింది. చాలా సీన్స్ త‌న బ్యాగ్రౌండ్ స్కోర్ తో హైలైట్ చేసాడు ఈయ‌న‌. అంతేకాదు.. పాట‌లు కూడా బాగున్నాయి. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ అదిరిపోయింది. ఎడిటింగ్ ప‌ర్లేదు. సాయి కొర్ర‌పాటి నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. కొత్త హీరో అయినా కూడా ఖ‌ర్చు భారీగానే పెట్టాడు. ఇక ద‌ర్శ‌కుడిగా రాకేష్ శ‌శి తొలి సినిమాతో పోలిస్తే రెండో సినిమాకు చాలా బెట‌ర్. రొటీన్ క‌థతోనే ప‌ర్లేదనిపించాడు. అయితే ఊహించే క‌థ కావ‌డం ఒక్క‌టే దీనికి మైన‌స్.
చివ‌ర‌గా:
విజేత‌.. కాస్త క‌ష్ట‌ప‌డితే గెలుపు ఖాయమే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here