ర‌వితేజ‌కు ఇలియానా బైబై..


అదేంటి.. మొన్నేక‌దా షూటింగ్ కు వ‌చ్చింది అప్పుడే వెళ్లిపోవ‌డం ఏంటి..? అను ఎమ్మాన్యువ‌ల్ కానీ సినిమాలోంచి వెళ్లిపోయిన‌ట్లు ఇలియ‌నా కూడా మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిందా ఏంటి అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదులెండి.. సింపుల్ గా త‌న షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయింది ఇలియానా.
మొన్నే వ‌చ్చిన‌ట్లు అనిపించినా.. నెల రోజులు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసింది గోవాబ్యూటీ. దాంతో ఈమె షూటింగ్ అయిపోయిన త‌ర్వాత గిఫ్ట్ ఇచ్చి మ‌రీ సాగ‌నంపారు శీనువైట్ల అండ్ అత‌డి భార్య రూప‌వైట్ల‌. అస‌లే ఇలియానా పేరు విని ఆరేళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో 2012లో ర‌వితేజ‌తోనే దేవుడు చేసిన మ‌నుషులు సినిమా చేసిన త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీ వైపు చూడ‌ట‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. పూర్తిగా బాలీవుడ్ కు ప‌రిమితం అయిపోయింది.
అక్క‌డ నాలుగైదు సినిమాలు చేసినా కూడా పెద్ద‌గా గుర్తింపు అయితే రాలేదు. విజ‌యాలు ఉన్నా ఎందుకో కానీ ఇలియానా వైపు చూసింది లేదు. ప్ర‌స్తుతం ఖాళీగానే ఉన్న ఇల్లీబేబికి మ‌ళ్లీ త‌నే పిలిచి అవ‌కాశం ఇచ్చాడు ర‌వితేజ‌. ఇలియానా అయితే బాగుంటుంద‌ని మాస్ రాజానే రిఫ‌ర్ చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ర‌వితేజ‌తో క‌లిసి కిక్.. ఖ‌త‌ర్నాక్.. దేవుడు చేసిన మ‌నుషులు సినిమాల్లో న‌టించింది ఇలియానా. ఇలియానాతో నాలుగు సినిమాలు చేసిన ఏకైక హీరో ర‌వితేజ‌నే. మ‌రి చూడాలిక‌.. ఒక్క హిట్ రెండు ఫ్లాపులుగా ఉన్న ఈ కాంబినేష‌న్ కొత్త సినిమాతో ఎలా మార‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here