లేడీ టైటిల్ తో మాస్ రాజా..


ర‌వితేజ సినిమా టైటిల్ అంటే ప‌క్కా మాస్ గా ఉంటుంది. లేదంటే ఆయ‌న ఫ్యాన్స్ కు కూడా పెద్ద‌గా కిక్ ఇవ్వ‌వు ఈ టైటిల్స్. ఈ మ‌ధ్య వ‌చ్చిన సినిమాల‌కు కూడా ట‌చ్ చేసి చూడు.. నేల‌టికెట్.. రాజా ది గ్రేట్ అంటూ ప‌క్కా మాస్ టైటిల్స్ తోనే వ‌చ్చాడు ఈ హీరో. ఇప్పుడు శీనువైట్ల సినిమాకు కూడా అమ‌ర్ అక్బర్ ఆంటోనీ టైటిల్ పెట్టారు.
అలాంటి ర‌వితేజ‌కు ఇప్పుడు ఓ లేడీ టైటిల్ పెట్ట‌బోతున్నారు. అయితే లేడీ టైటిల్ అయినా కూడా మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ అది. గ‌తంలో వెంకీ కానీ తుల‌సి, ల‌క్ష్మి సినిమాలు చేసిన‌ట్లు.. ఇప్పుడు ర‌వితేజ క‌న‌క‌దుర్గ అంటున్నాడు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీతో పాటు మ‌రో రెండు సినిమాల‌కు కూడా ఓకే చెప్పాడు మాస్ రాజా. అవి కూడా ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌తోనే కావ‌డం విశేషం. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ త‌ర్వాత తెరీ రీమేక్ లో న‌టించ‌నున్నాడు ర‌వితేజ‌.
సంతోష్ శ్రీ‌నివాస్ దీనికి ద‌ర్శ‌కుడు. తెరీ ఇప్ప‌టికే తెలుగులో పోలీసోడుగా వ‌చ్చింది. దాంతో కేవ‌లం థీమ్ మాత్ర‌మే తీసుకుని క‌థ అంతా మార్చేస్తున్నాడు సంతోష్. హైప‌ర్ త‌ర్వాత ఈయ‌న చేయ‌బోయే సినిమా ఇది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకున్నా.. ఈయ‌న బిజీ కార‌ణంగా ఆ సినిమా ర‌వితేజ చేతుల్లోకి వ‌చ్చింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా న‌టించ‌బోతున్నాడు ర‌వితేజ‌.
ఈ సినిమాలో హీరోకు కూతురు కూడా ఉంటుంది. విక్ర‌మార్కుడు త‌ర‌హా సెంటిమెంట్ దీనికి వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని భావిస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమాకు క‌న‌క‌దుర్గ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసేలా ఉన్నారు. ఈ రెండు సినిమాల‌ను మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. పైగా వీటికోసం రెమ్యున‌రేష‌న్ కూడా తీసుకోవ‌డం లేదు మాస్ రాజా. విడుద‌లైన త‌ర్వాత వ‌చ్చే లాభాల్లో వాటా తీసుకోనున్నాడు ర‌వితేజ‌. మొత్తానికి క‌న‌క‌దుర్గ‌తో పాటు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ర‌వితేజ‌కు ఎలాంటి ఫ‌లితం తీసుకొస్తాయో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here