వార‌సుల‌కు నాని స‌వాల్..


ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాలంటే వార‌స‌త్వం ఉండాలి.. బ్యాగ్రౌండ్ లేక‌పోతే ఇండ‌స్ట్రీలో స్టార్లుగా మార‌డం క‌ష్ట‌మే.. ఇన్నాళ్లూ ఇవే అనుకునేవాళ్లంతా. ర‌వితేజ వ‌చ్చి స్టార్ అయినా కూడా ఆయ‌న మార్కెట్ ఎప్పుడూ 35 కోట్లు కూడా దాట‌లేదు. ఓ టైమ్ లో స్టార్ హీరోగా వెలిగిపోయాడు కానీ మార్కెట్ విష‌యంలో ఎప్పుడూ స్టార్ స‌న్స్ తో పోటీ ప‌డ‌లేదు మాస్ రాజా. 50 కోట్లు అందుకోవాలంటే క‌చ్చితంగా వార‌సుడే అయి ఉండాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ క్ల‌బ్ లో చేరిన హీరోలంతా వార‌సులే. సొంతంగా వ‌చ్చిన హీరోల‌కు అంత దూరం వెళ్లే అవ‌కాశం అయితే ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు నాని చ‌రిత్ర తిర‌గ‌రాస్తున్నాడు. ఈ హీరో సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటున్నాడు. తాజాగా నానితో కొర‌టాల‌, త్రివిక్ర‌మ్ సినిమాలు చేయ‌బోతున్నారు. సోలోగానే ఎంసిఏతో 40 కోట్ల మార్క్ అందుకున్న నాని.. ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ల అండ‌తో క‌చ్చితంగా మ‌రో 20 కోట్లు అందుకుంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అదే కానీ జ‌రిగితే క‌చ్చితంగా నాని రేంజ్ 60 కోట్ల‌కు చేర‌డం ఖాయం.
ఏ హీరో అయినా జీవితంలో ఒక్క‌సారైనా కెరీర్ లో ఇలాంటి పీక్ స్టేజ్ ఉండాల‌ని కోరుకుంటాడు. నానికి ఇది వ‌చ్చేసింది. వ‌ర‌స‌గా 8 విజ‌యాలు అందుకున్నాడు ఈ హీరో. ఈ హీరోను చూసి ఇప్పుడు ఇత‌ర హీరోలు కుళ్లుకోలేదంటే అది క‌చ్చితంగా అబ‌ద్ధ‌మే అవుతుంది. ఎందుకంటే ఆయ‌న ఉన్న రేంజ్ అలాంటిది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఎనిమిది విజ‌యాల‌తో దూకుడు మీదున్నాడు నాని. ఇప్పుడు ఈయ‌న మార్కెట్ రేంజ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. స‌రిగ్గా మూడేళ్ల కింద 10 కోట్లు కూడా లేని నాని మార్కెట్ ఇప్పుడు 40 కోట్ల‌కు త‌గ్గ‌డం లేదు. ఒక్కో సినిమాతో త‌న రేంజ్ అలా అలా పెంచుకుంటూ వెళ్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఇప్ప‌టి వ‌ర‌కు నాని ఒక్క‌డే ఒంటిరి పోరాటం చేసాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయ‌నకు తోడుగా త్రివిక్ర‌మ్, కొర‌టాల లాంటి స్టార్ డైరెక్ట‌ర్స్ వ‌స్తున్నారు. కొర‌టాల‌తో యువ‌సుధ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో నాని సినిమా క‌న్ఫ‌ర్మ్ అయింది. ఇక త్రివిక్ర‌మ్ తో దాన‌య్య నిర్మాణంలో నాని సినిమా చేయ‌బోతున్నాడు.
ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న కృష్ణార్జున యుద్ధం ఓవ‌ర్సీస్ హ‌క్కులు రికార్డ్ స్థాయిలో అమ్ముడ‌య్యాయి. ఆ సినిమాను అక్క‌డ 4.14 కోట్ల‌కు కొనేసారు అక్క‌డి బ‌య్య‌ర్లు. ఎలా ఉంటుందో తెలియ‌దు.. ఎలా వ‌స్తుందో తెలియ‌దు.. అస‌లు అంత అమౌంట్ వ‌స్తుందో రాదో క్లారిటీ లేదు.. అయినా కానీ సినిమాను కొనేసారు. నాలుగు నెల‌ల ముందే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తైపోయింది. అది నాని రేంజ్ ఇప్పుడు. ఓవ‌ర్సీస్ లో మ‌హేశ్ త‌ర్వాత ఎక్కువ రికార్డులు నానికే సొంతం. ఇప్ప‌టికే 5 మిలియ‌న్ మార్క్ సినిమాలు అందుకున్నాడు నాని. 2017లో అయితే వ‌ర‌స‌గా మూడు సినిమాలు అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం కోసం పెట్టిన రేట్ రామ్ చ‌ర‌ణ్ కంటే ఎక్కువ‌. ఎంసిఏ 3.5 కోట్ల‌కు కొంటే బాగానే తీసుకొచ్చింది. దాంతో ఇప్పుడు ఆ రేంజ్ మ‌రింత పెరిగిపోయింది. ఎప్రిల్ 12న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం గానీ హిట్టైతే ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టిన ఏకైక హీరోగా చ‌రిత్ర సృష్టిస్తాడు నాని. మొత్తానికి నాని రేంజ్ 60 కోట్ల‌కు కానీ చేరితే వార‌సుల‌కు చుక్క‌లు ప్ల‌స్ ఏడుపులే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here