విజయవాడలో ఘనంగా నిఖిల్ “కిరాక్ పార్టీ” ఆడియో విడుదల

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా “కిరిక్ పార్టీ”ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగులో “కిరాక్ పార్టీ”గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి అనే యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను విజయవాడలోని ఉషారామా ఇంజనీరింగ్ కాలేజ్ లో వేలాది కాలేజ్ స్టూడెంట్స్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
అల్లరి నరేష్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలో “కిరాక్ పార్టీ” చిత్ర బృందం మొత్తం పాల్గొనడం విశేషం.
అల్లరి నరేష్ బిగ్ సీడీని విడుదల చేయగా.. ఆడియో సీడీని విడుదల చేసి మొదటి సీడీని నిర్మాతల్లో ఒకరైన రామబ్రహ్మం సుంకరకు అందించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. “మా బ్యానర్ సొంత హీరో లాంటి అల్లరి నరేష్ అడగ్గానే విజయవాడలో జరుగుతున్న ఈ వేడుకకు విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం కోసం వర్క్ చేసిన సుధీర్ వర్మ, చందు మొండేటిలకు ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేసుకొంటున్నాను. కాలేజ్ లో షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వడమే కాక ఆడియో రిలీజ్ కి కూడా సహకరించిన ఉషారామా విద్యాసంస్థ యాజమాన్యానానికి కృతజ్ణతలు. మా టీం అందరూ ఎంతో కష్టపడి ఈ చిత్రంలో నటించారు. మార్చి 16కి సినిమా కూడా ఈ ఆడియో ఫంక్షన్ లా రీసౌండ్ వస్తుందని ఆశిస్తున్నాం” అన్నారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లరి నరేష్ మాట్లాడుతూ.. “మార్చి 16న స్టూడెంట్స్ ఎవరూ అటెండెన్స్ గురించి పట్టించుకోకండి.. అటెండెన్స్ వేయించే బాధ్యత నాది. నాకు నిఖిల్ ని చూసినప్పుడల్లా డ్యూరో సెల్ బ్యాటరీ గుర్తుకొస్తుంది. మా ఆహుతి ప్రసాద్ గారి అబ్బాయి కార్తీక్ ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కన్నడలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. అదే స్థాయిలో తెలుగులోనూ సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం” అన్నారు.
చిత్ర కథానాయకుడు నిఖిల్ మాట్లాడుతూ.. “మా ఆడియో విడుదలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లరి నరేష్ గారికి నా ధన్యవాదాలు. ఆయన ఆడియో విడుదల చేసిన నా ప్రతి సినిమా సూపర్ హిట్.. అలాగే “కిరాక్ పార్టీ” కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. మార్చి 16న థియేటర్స్ లో రచ్చ రచ్చ అయిపోతుంది. కన్నడలో ఇంత మంచి సినిమా ఒకటి ఉందని గుర్తించి.. నాకు ఈ కథలో నటించే అవకాశాన్ని అనిల్ సుంకర గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. “కార్తికేయ”తో చందు మొండేటి, “స్వామి రారా”తో సుధీర్ వర్మకు ఎలాంటి మంచి పేరు వచ్చిందో.. “కిరాక్ పార్టీ”తో శరణ్ కి కూడా అదే స్థాయి పేరొస్తుంది. ఎంటర్ టైన్మెంట్ తోపాటు మంచి మెసేజ్ కూడా ఉన్న సినిమా ఇది” అన్నారు.

చిత్ర కథానాయిక సిమ్రాన్ పరీంజా మాట్లాడుతూ.. “తెలుగులో నా మొట్టమొదటి అవకాశం “కిరాక్ పార్టీ” అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సాంగ్స్, ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాని కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

చిత్ర కథానాయికల్లో ఒకరైన సంయుక్త హెగ్డే మాట్లాడుతూ.. “సినిమా రిలీజ్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆడియన్స్ అండ్ మన స్టూడెంట్స్ అందరూ కలిసి “కిరాక్ పార్టీ”ని సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
చిత్ర దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ.. “మార్చి 16న స్టూడెంట్స్ అందరూ మాస్ బంక్ కొట్టి మరీ “కిరాక్ పార్టీ” ఎంజాయ్ చేస్తారని కోరుకొంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్ధి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది” అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాధ్. మాటలు: చందూ మొండేటి, స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, కళ: అవినాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో-డైరెక్టర్: సాయి దాసమ్, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర-అభిషేక్ అగర్వాల్, బ్యానర్: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here