విశాఖకు మహానుభావుడు చిత్ర బృందం 

దసరావళి సంబరాల్లో సందడి చేయనున్న హీరో శర్వానంద్ మరియు చిత్రయూనిట్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ అధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో జరుగుతున్న  దసరావళి ఉత్సవాలకు మహానుభావుడు చిత్రయూనిట్ హాజరుకానున్నారు.
 హిరో శర్వానంద్, హిరోయిన్ మెహరిన్ తో పాటుగా దర్శకుడు మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు పాల్గొంటారు…. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెపేందుకు థాంక్స్ టు మీట్ విశాఖలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది… సోమవారం సాయంత్రం ఆరు గంటలకు RK బీచ్ లో దసరవాలి వేదికపై నుంచి చిత్రయూనిట్ ప్రేక్షకులను అలరించనున్నారు….