వెంకీతో నితిన్ సినిమా క‌న్ఫ‌ర్మ్..

Nithin25
వెంకీ అంటే ఇక్క‌డ హీరో వెంక‌టేశ్ కాదండీ బాబూ..! అస‌లే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టారర్ల ట్రెండ్ బాగా న‌డుస్తుంది. ఇలాంటి టైమ్ లో వెంకీతో నితిన్ సినిమా అంటే వెంక‌టేశ్ తో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడేమో అనుకుంటారు. కానీ ఇక్క‌డ వెంకీ అంటే ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఈ మ‌ధ్యే ఛ‌లో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ ఏడాదిలో ఇప్ప‌టివర‌కు ఉన్న ఒకేఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ అది. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ఇప్పుడు రెండో సినిమాను నితిన్ తో ప్లాన్ చేసుకుంటున్నాడు. లై ఫ్లాప్ అయినా నితిన్ కెరీర్ మాత్రం ఇప్పుడు మంచి జోరు మీదుంది. ఇప్ప‌టికే ఈ కుర్ర హీరో చేతుల్లో మూడు సినిమాలున్నాయి. వీటిలో ఛ‌ల్ మోహ‌న్ రంగా ఎప్రిల్ 5న ఈ సినిమా రానుంది. కృష్ణ‌చైత‌న్య తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రానికి ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ నిర్మాత‌లు. క‌థ కూడా త్రివిక్ర‌మే అందించాడు.
ఇక ఈ చిత్రంతో పాటు ఈ మ‌ధ్యే స‌తీష్ వేగేశ్న‌తో శ్రీ‌నివాస క‌ళ్యాణం మొద‌లుపెట్టాడు. రాశీఖ‌న్నా ఇందులో హీరోయిన్. దిల్ రాజు నిర్మిస్తుండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఎప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. జులై 24న ఈ చిత్రం విడుద‌ల కానుంద‌ని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సినిమాతో పాటు హ‌రీష్ శంక‌ర్ దాగుడు మూతలు సినిమాలోనూ ఓ హీరోగా న‌టించ‌నున్నాడు నితిన్. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌తో పాటు ఇప్పుడు వెంకీ కుడుముల‌తో సినిమా క‌న్ఫ‌ర్మ్ చేసాడు నితిన్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించ‌నున్నాడు. ఈ మూడు సినిమాల‌తో పాటు మ‌రో రెండు క‌థ‌ల‌ను ఫైన‌ల్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. మొత్తానికి లై లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కూడా నితిన్ వ‌రస సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. మ‌రి ఈ దూకుడు అత‌డి కెరీర్ ను ఎటు వైపుకు తీసుకెళ్ల‌నుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here